సైరా తాజా అప్ డేట్స్

కొన్ని రోజులుగా సైరా సినిమా గురించి ఎలాంటి వార్త‌లు లేవు.. ముచ్చ‌ట్లు అస‌లే లేవు. సింపుల్ గా త‌మ ప‌నేదో తాము చేసుకుంటూ వెళ్తున్నారు చిత్ర‌యూనిట్. హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌రుగుతున్నా కూడా సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఇప్పుడు సైరా మ‌రో షెడ్యూల్ కూడా పూర్తైపోయింది. హైద‌రాబాద్ లోని రంగ‌స్థ‌లం సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇక్క‌డే ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్.. జూన్ 5 నుంచి మ‌రో షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్ర షూటింగ్ 25 శాతం పూర్త‌యింది. ఇక కొత్త షెడ్యూల్ ఏకంగా నెల రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, సుదీప్, విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ అంతా పాల్గొన‌బోతున్నారు.

ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు స‌గం పూర్తైన‌ట్లే అంటున్నారు యూనిట్. దానికితోడు మేజ‌ర్ యాక్ష‌న్ సీక్వెన్సులన్నీ ఈ షెడ్యూల్లోనే పూర్తి కానున్నాయి. ఈ షెడ్యూల్ కోస‌మే హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా ఓ సెట్ కూడా వేసారు. దానికితోడు రంగ‌స్థ‌లం సెట్ ను కూడా త‌మ‌కు కావాల్సిన విధంగా మార్చుకున్నారు సైరా ఆర్ట్ డైరెక్ట‌ర్స్. ఈ ఏడాది చివ‌రివ‌ర‌కు షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. అలా చేస్తే కానీ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కు సినిమాను సిద్ధం చేయ‌లేరు. ఇప్పుడు ఆల‌స్యం అయితే.. అప్పుడు విడుద‌ల కూడా ఆల‌స్యం అవుతుంది. అందుకే ప‌నుల‌న్నీ వేగంగా పూర్తి చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఈ చిత్రాన్ని 200 కోట్ల‌తో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు.

User Comments