శ్రీకాంత్‌ని ప‌రామ‌ర్శించిన చిరంజీవి

Chiru condolences to Srikanth Family

కథానాయకుడు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయ‌న్ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు అగ్ర న‌టుడు చిరంజీవి. శ్రీకాంత్ తండ్రి గారైన మేక పరమేశ్వరరావు ఆదివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకా వారి పాలెం లో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత
మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. చిరంజీవితో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి చేరుకుని ఆయన్ని ప‌రామ‌ర్శించారు.