చిరు- కొర‌టాల డిసెంబ‌ర్‌లో

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం `సైరా- న‌ర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 2019లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. అందుకు త‌గ్గ‌ట్టే సురేంద‌ర్ రెడ్డి ప‌క‌డ్భందీ వ్యూహంతో వేగంగా పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ సినిమా త‌ర‌వాత మెగాస్టార్ న‌టించే సినిమా ఏది? అంటే అది క‌చ్ఛితంగా కొర‌టాల శివ‌తోనే ఉంటుంద‌ని చెబుతున్నారు.

`భ‌ర‌త్ అనే నేను` సినిమా వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఆ వెంట‌నే కొర‌టాల వినిపించిన సింగిల్ లైన్‌ని ఓకే చెప్పార‌ట‌. ఆ క్ర‌మంలోనే విదేశాల‌కు రిలాక్స్ ట్రిప్ వెళ్లిన కొర‌టాల చిరు కోసం క‌థ‌పైనా క‌స‌ర‌త్తు చేశారు. ఇప్పుడు తిరిగి ఇండియా వ‌చ్చి ప‌ని మొద‌లు పెట్టార‌ని తెలుస్తోంది. అంటే ఈ స్క్రిప్టుపై పూర్తి క్లారిటీ వ‌చ్చేశాక చిరుని క‌లిసి వినిపిస్తారు. అటుపై డిసెంబ‌ర్‌లో ముహూర్తం చేసేందుకు ఏర్పాట్లు చేస్తార‌ట‌. ఈ సినిమాని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా నిర్మిస్తారు. వాస్త‌వానికి గీతాఆర్ట్స్‌లో బోయ‌పాటితో చిరు సినిమా చేయాల్సి ఉన్నా.. అది కాస్తంత వెన‌క్కి వెళ్లే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. ఇక‌పోతే బోయ‌పాటి బాల‌య్య‌తో ఓ ప్రాజెక్టు చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

User Comments