వావ్.. చిరు మూవీ టైటిల్ ఉయ్యాలవాడ కాదు 

Chirus Uyyalawada Changed Mahaveera

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా అంటూ తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓవైపు తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడానికి మెగా టీమ్ ఉత్సాహంగా ఉంటే.. మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించడానికి చిరు కూడా ఎంతో ఆసక్తిగా ఉంటూ అన్ని విధాలా రెడీ అయిపోతున్నారు.
ఇక నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి లు అయితే, ఈ మెగా సినిమాను గ్రాండ్ లెవెల్ లో జాతీయ స్థాయిలో తీసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సినిమాకు ఓ సూపర్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అదేంటి ఈ సినిమా టైటిల్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కదా అనుకుంటున్నారా.. కానీ అది కాదంట. ఈ సినిమాకు ‘మహావీర’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారని తాజా ఫిల్మ్ నగర్ టాక్. దీనికి కారణం లేకపోలేదు. ఈ మెగా సినిమాను తెలుగులో మాత్రమే తీయాలనుకుంటే అప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ టైటిల్ బాగుండేది.
కానీ, ఇప్పుడు ఈ సినిమాను తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తుండటంతో.. అన్ని భాషలకు సూట్ అయ్యేలా సూపర్ టైటిల్ కోసం అన్వేషించిన మెగా టీమ్ చివరకు ‘మహావీర’ కు ఫిక్స్ అయిపోయారట. ఈ మేరకు త్వరలోనే ఈ ‘మహావీర’ టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించనున్నారని సమాచారం. ఇకపోతే, ఈ ఆగష్టులోనే గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించి ఉయ్యాలవాడను మహావీర గా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక ఈ మహావీర కు జోడీగా ఇప్పటికే నయనతారను ఫిక్స్ చేశారని న్యూస్ రాగా, ఇప్పుడు మరో హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ ను దాదాపుగా ఒప్పించేశారని, అలాగే మూడో హీరోయిన్ కోసం చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఏదిఏమైనా, ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జాతీయ స్థాయిలో తన వీరత్వం చూపించడానికి ‘మహావీర’ గా మారడం అనేది నిజంగా విశేషమే.