అజిత్ ను ఫాలో అవుతున్న విక్ర‌మ్..

Last Updated on by

ఒక‌ప్పుడు తెల్ల‌జుట్టు క‌నిపిస్తే చాలు.. అద్దం ముందు పెట్టుకుని ఎక్క‌డెక్క‌డ ఉందా పీకేద్దాం అనే కంగారు క‌నిపించేది అంద‌రిలో. కానీ ఇప్పుడ‌లా కాదు. తెల్ల‌జుట్టు లేక‌పోతే ఫీల్ అవుతున్నారు. ఉంటే హ్యాపీ అంటున్నారు. కొంద‌రైతే కావాల‌ని వైట్ క‌ల‌ర్ కూడా వేసుకుంటున్నారు. తెల్ల‌జుట్టుతో అంతా మెరిసిపోతున్నారు ఇప్పుడు. ఒక‌ప్పుడు ముస‌లిత‌నానికి నిద‌ర్శ‌నంగా ఉండే తెల్ల‌జుట్టు ఇప్పుడు కుర్రాళ్ల‌కు మంచి స్టైల్ ఐకాన్ గా మారింది. దానికి కార‌ణం అజిత్ కుమార్. అవును.. త‌మిళ హీరో అజిత్ తెల్ల‌జుట్టుకు బ్రాండ్ అంబాసిడ‌ర్. ఆయ‌న త‌న సినిమాల్లో జుట్టుకు రంగేసుకోడు. ఇంకా చెప్పాలంటే తెల్ల‌జుట్టుతోనే కావాల్సిన‌న్ని ప్ర‌యోగాలు చేస్తాడు. ఈయ‌న్ని చూసి ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా తెల్ల‌జుట్టే కావాల‌నుకుంటున్నారు. ఇప్పుడు విక్ర‌మ్ కూడా అజిత్ రూట్ నే ఫాలో అవుతున్నాడు.

ఈయ‌న కూడా త‌న కొత్త సినిమాలో తెల్ల‌జుట్టుతోనే క‌నిపిస్తున్నాడు. రంగేసి క‌వ‌ర్ చేయొచ్చుగా అంటే వైట్ హెయిర్ ఇప్పుడు స్టైల్.. ఇదే ట్రెండ్ అంటున్నాడు విక్ర‌మ్. సింపుల్ గా చెప్పాలంటే ఈయ‌న కూడా అజిత్ రూట్ నే ఫాలో అవుతున్నాడ‌న్న‌మాట‌. ఇప్పుడు విక్ర‌మ్ సామి 2తో పాటు ధృవ‌న‌క్ష‌త్రం.. క‌ర్ణ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. క‌మ‌ల్ హాస‌న్ కూడా త‌న నిర్మాణ సంస్థ‌లో విక్ర‌మ్ తో సినిమా తెర‌కెక్కించ‌బోతున్నాడు. మొత్తానికి ఇన్నాళ్లూ త‌మిళనాట తెల్ల‌జుట్టుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ అజిత్ ఒక్క‌డే అనుకున్నారు ఇప్పుడు ఆయ‌న‌కు తోడుగా విక్ర‌మ్ కూడా జాయిన్ అయ్యాడ‌న్న‌మాట‌.

User Comments