సినీ గ్లామ‌ర్ కోసం జాతీయ‌ పార్టీల పాట్లు!

Last Updated on by

రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ని దృష్టిలో పెట్టుకుని జాతీయ రాజ‌కీయాల్లో ర‌స‌వ‌త్త‌ర మార్పు చోటు చేసుకుంటోంది. ఎలాగైనా ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవాల‌ని జాతీయ పార్టీలు సినీ గ్లామ‌ర్ వేట‌లో ప‌డుతున్నాయి. ఇందులో భాగంగా భోపాల్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ త‌రుపున‌ బాలీవుడ్ స్టార్ నాయిక క‌రీనా క‌పూర్‌ను రంగంలోకి దింపాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ ఆ విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగించాల‌ని చూస్తోంది.

క‌రీనాక‌పూర్ భోపాల్ న‌వాబ్ కుటుంబానికి చెందిన మ‌న్సూర్ అలీఖాన్ కోడ‌లు కాబ‌ట్టి ఆమెనే భోపాల్ నుంచి పోటీకి దింపాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంద‌ట‌. దీనికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు గుడ్డు చౌహాన్‌, అనీస్ ఖాన్‌లు పూర్తి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైక‌మాండ్‌కు కూడా ఈ విష‌యాన్ని వారు తెలిపిన‌ట్లు చెబుతున్నారు. గ‌త కొన్పేళ్లుగా దేశ శ్యాప్తంగా అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకున్న క‌రీనా క‌పూర్ కాంగ్రెస్ త‌రుపున నిల‌బ‌డితే యువ ఓట‌ర్లంతా ఆమెకు బ్ర‌హ్మ‌ర‌థంప‌ట్టే అవ‌కాశం వుంద‌ని వారు పేర్కొన్న‌ట్లు తెలిసింది. అయితే గ‌తంలో ఇదే నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేసిన క‌రీనాక‌పూర్ మామ‌, సైఫ్ అలీఖాన్ తండ్రి న‌వాబ్ ప‌టౌడీ బీజేపీ అభ్య‌ర్థి సుశీల్ చంద్ర‌పై ఓడిపోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. కాంగ్రెస్ వ‌ర్గాలు త‌న‌ని పోటీకి దింపాల‌ని హ‌డావిడీ చేస్తున్నా క‌రీనా మాత్రం రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌నే కోరిక నాకు లేద‌ని, అస‌లు రాజ‌కీయాలంటేనే త‌న‌కు ఆస‌క్తిలేద‌ని తేల్చి చెప్ప‌డం కాంగ్రెస్ వ‌ర్గాల‌ని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

User Comments