టాప్ ప్రొడ్యూస‌ర్ల మ‌ధ్య యుద్ధం

Last Updated on by

వాళ్లిద్ద‌రూ ఇండ‌స్ట్రీలో అగ్ర నిర్మాత‌లు. కొన్నేళ్ల నుంచి ప్ర‌తీ స్టార్ హీరోతోనూ సినిమాలు నిర్మించిన అనుభ‌వం వాళ్ల సొంతం. ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసి ఓ సూప‌ర్ స్టార్ మైల్ స్టోన్ మూవీ నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ కూడా మొద‌లైంది. నేడోరేపో సినిమా ప‌ట్టాలెక్క‌బోతుంది కూడా. అన్నీ బాగానే ఉన్నాయి అనుకునే త‌రుణంలో ఇప్పుడు ఆ ఇద్ద‌రు అగ్ర నిర్మాత‌ల మ‌ధ్య ఆర్థిక ఇబ్బందులు వ‌చ్చిన‌ట్లుగా ఇండ‌స్ట్రీలో వార్త‌లొస్తున్నాయి. సినిమా మొద‌ల‌వ్వ‌క ముందు అందులో ఓ నిర్మాత బాగా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆయ‌న‌కు కొన్నేళ్ల త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది. అది కూడా త‌న కూతుళ్ల సాయంతో.

దాంతో ఆ సినిమా తీసుకొచ్చిన విజ‌యంతో ఇప్పుడు మ‌రో నిర్మాత‌తో క‌లిసి నిర్మిస్తున్న సినిమాలో అత్య‌ధిక వాటా కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం కేవ‌లం ప్ర‌జెంట‌ర్ గా ఉంటూ.. లాభాల్లో కొన్ని వాటాలు మాత్ర‌మే తీసుకోవాల‌ని రాసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క విజ‌యం వ‌చ్చేస‌రికి త‌న‌కు కూడా స‌మాన‌మైన లాభాలు కావాలంటూ విభేదాల‌కు పోతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రు అగ్ర నిర్మాత‌ల వల్ల షూటింగ్ కూడా ఆల‌స్యం అవుతుంద‌ని తెలుస్తుంది. వీళ్ల‌ను స‌ముదాయించ‌లేక పాపం ఆ సూప‌ర్ స్టార్ కూడా ఇరుక్కుపోతున్నాడు. ఎందుకంటే గ‌తంలో ఇద్ద‌రూ త‌న‌కు హిట్లు ఇచ్చిన నిర్మాత‌లే. దాంతో ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నాడ‌ని కొన్ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

User Comments