బెజ‌వాడ‌లో సూప‌ర్‌స్టార్ హంగామా

Last Updated on by

రీల్ సీఎం మ‌హేష్ న‌వ్యాంధ్ర రాజ‌ధానికి వెళుతున్నారు. అక్క‌డ అభిమానుల్ని నేరుగా క‌లుసుకుని అభివాదం చేయ‌నున్నాడు. తాను సీఎం అయితే ఎలాంటి మార్పులు ఉంటాయో సినిమాలో అద్భుతంగా చెప్పాడు కాబ‌ట్టి రాజ‌ధాని వాసుల‌కు మ‌హేష్ ఏం చెబుతాడోన‌న్న క్యూరియాసిటీ అక్క‌డ అభిమానుల్లో ఉంది. నేడు అమ‌రావ‌తి, విజ‌య‌వాడ ఫ్యాన్స్ మీట్ అనంత‌రం ప్రెస్‌మీట్ ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్ప‌టికే కృష్ణ‌, గుంటూరులో స్పెష‌ల్ రికార్డులు అందుకున్న మ‌హేష్ ఈ విజిట్‌లో అభిమానుల‌కు మ‌రింత చేరువ‌గా వెళ్లేందుకు ఈ ట్రిప్ సాయం అవుతుంద‌న్న‌మాట‌!

టూర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే.. తొలుత మ‌హేష్ బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ను సంద‌ర్శించుకుంటాడు. అమ్మ‌వారి దర్శనం పూర్తి చేసుకుని.. ఆ తరువాత ట్రెండ్స్ మాల్, అన్నపూర్ణ థియేటర్ కు వెళ‌తారు. ప‌లుచోట్ల సింగిల్ థియేట‌ర్ల‌లోనూ అభిమానుల మ‌ధ్య సినిమా వీక్షించి, అటుపై ఫ్యాన్స్‌తో ముచ్చ‌టిస్తారు. థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉందో మ‌హేష్ స్వ‌యంగా ప‌రిశీలిస్తారు. ఈ ట్రిప్‌లో మహేష్ తో పాటు చిత్రబృందం ప‌ర్య‌టించ‌నుంది. భ‌ర‌త్ అనే నేను చిత్రంలో రీల్‌ సీఎం పాత్రలో మ‌హేష్ న‌ట‌నాభిన‌యం అభిమానుల‌కు పిచ్చిగా న‌చ్చేసింది. ముఖ్యంగా ఎడ్యుకేష‌న్‌ని సంత‌లో ప‌శువులా మార్చి అమ్మ‌కాలు సాగిస్తున్న ప‌లువురు ఏపీ మంత్రుల్ని సినిమా సాక్షిగా నిల‌దీసిన తీరు మ‌రీ మ‌రీ న‌చ్చేసింది. అంతేకాదు .. రాజ‌కీయ నేత‌ల్ని `మాట మీద నిల‌బ‌డే మ‌గాళ్ల‌ను చేస్తాన‌`ని మ‌హేష్ చెప్పిన డైలాగ్ ఎక్క‌డో క‌నెక్ట‌యిపోయింది. అందుకే ఇప్పుడు మ‌హేష్ రాజ‌ధాని ప‌ర్య‌ట‌న ఓ రేంజులోనే వేడి పెంచుతోంది. రీల్ సీఎం నేత‌ల తీరుతెన్నుల్ని ఓ రేంజులో తిట్టి పారేశాడు కాబ‌ట్టి.. ఇంత‌కీ ఈ విజిట్‌కి వ‌స్తున్న మ‌హేష్‌ని ఎవ‌రైనా రాజ‌ధాని నేత‌లు క‌లుస్తారా? లేదా? అన్న‌ది చూడాలి.

User Comments