ప్ర‌జా వేదిక కూల్చివేత‌.. సామాన్యుడి గోడు!

నిబంధనలకు విరుద్దంగా, అవినీతితో నిర్మించిన ప్ర‌జావేదిక‌ భవనాన్ని కూల్చివేస్తామని జగన్ ప్రకటించారు. అక్కడ నిర్మాణమైన ప్రజావేదిక కూల్చేయాలి అన్న నిర్ణ‌యం ఆంధ్రా సీఎం జగన్ తీసుకోవడం ఒక సామాన్యుడిగా స్వాగ‌తించాలి. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించింది. అదేవిధంగా గత ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.గత ప్రభుత్వానికి ఇసుక తవ్వకాలపై వంద కోట్ల రూపాయల జరిమానా కూడా విధించడం ఓ సంచ‌ల‌నం. జగన్ మాట ప్ర‌కారం.. ఒక నాయకుడు రోల్ మోడల్ గా ఉండాలి. నాయకుడు తప్పు చేస్తే జై కొడుతున్నారు. కానీ అది స‌రికాదు. న‌దులు.. సముద్రం తీర ప్రాంతాలు చాలా సెన్సిటివ్ ఏరియాస్. అదేవిధంగా వాటిల్లో లో పబ్లిక్ ల్యాండ్ లో లో ఏ విధమైన కట్టడాలు కట్టకూడదని సుప్రీం కోర్ట్ ఆంక్షలు కూడా ఉన్నాయి. కానీ మ‌న నాయ‌కుల నిర్వాకం ప‌రిశీలిస్తే..ఎక్కువ శాతం పార్కుల్లో దేవాలయాలు.. యోగా సెంటర్ల పేరుతో సామూహిక కట్టడాలు ఏ విధమైన పర్మిషన్ లేకుండా కడుతున్నారు.

దీంట్లో అధిక భాగం ఆయా కాలనీ అసోసియేషన్ల పెత్త‌న‌మే ఎక్కువ‌. స్థానిక రాజకీయ నాయకులకు ఈ చట్టం ఉంద‌ని తెలిసీ.. సుప్రీంకోర్టు తీర్పున‌కు వ్యతిరేకంగా ఈ నిర్మాణాలు చేప‌డుతున్నారు. అక్రమ నిర్మాణాల వలన వాతావరణ మార్పు.. అధిక ఉష్ణోగ్రత .. స్వల్ప వర్షాలు వంటి స‌మ‌స్య‌లున్నాయి. పార్కుల్లో పచ్చదనం లోపిస్తోంది. పక్షులు అంతరిస్తున్నాను అదేవిధంగా అభివృద్ధి పేరుతో సరస్సులు సెలయేర్లు పార్కుల్లో ఆక్ర‌మించ‌డం . భవనాలు నిర్మించడం కూడా సుప్రీం కోర్ట్ ఆంక్షలను వ్యతిరేకించడమే. కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్య‌క‌లాపాలు నిర్వహిస్తున్నారు. అది స‌రి కాదు. నిన్న సీఎం జగన్ ఇచ్చిన మెసేజ్ ప‌రిశీలిస్తే ప్ర‌తి నాయ‌కుడు ఒక రోల్ మోడల్ గా ఉండాలి. మనమే తప్పు చేస్తే ప్రజల పరిస్థితి ఏమవుతుంది? ఈ ఒక్క పాయింటు నచ్చి నేను ఈ మెసేజ్ ని ఈ సందేశాన్ని విడుదల చేస్తున్నాను. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు.. ఒక సామాన్య వ్యక్తిని.. ఏ ప్రభుత్వం మంచి చేసినా ఆ మంచిని ప్రోత్సహించడం నా.. మ‌న‌ కర్తవ్యం గా భావించాల‌ని అనుకుంటాను.