అలీకి గుంటూరు టిక్కెట్ క‌న్ఫామ్

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు చ‌నిపోక ముందు నుంచి క‌మెడియ‌న్ అలీ టీడీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ వ‌చ్చారు. ఆ పార్టీకి చాలా కాలంగా సానుభూతిప‌రుడిగా కొన‌సాగిన అలీ త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారంటూ ఈ మ‌ధ్య ప్ర‌చారం జోరుగా మొద‌లైంది. అయితే ఆ ప్ర‌చారానికి భిన్నంగా అలీ వ్య‌వ‌హ‌రించ‌డం ఎవ‌రికీ అర్థం కాలేదు. ఓ ద‌శ‌లో వైఎస్ ఆర్ సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం…ఆ త‌రువాత జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో భేటీ కావ‌డం…కొన్ని రోజుల త‌రువాత అధికార టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో సమావేశం కావ‌డంతో అలీ ఏ పార్టీలో చేరాల‌నుకుంటున్నాడో త‌న‌కే క్లారిటీ లేదా? ల‌ఏక త‌ను కోరిన టికెట్ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలో చేరాని ఇలా అంద‌రినీ అడుగుతున్నాడా? అనే ప్ర‌చారం జ‌రిగింది.

అయితే అలీ రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఆ నేత‌ల‌ని క‌ల‌వ‌లేద‌ని, త‌ను సినిమాల్లోకి ప్ర‌వేశించి 40 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో నిర్వ‌హించ‌నున్న‌ స‌న్మాన కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా ఆహ్వానించ‌డానికే వారిని క‌లిశార‌ని అర్థ‌మైంది. ఇక్క‌డే అస‌లు మ‌త‌ల‌బు జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చంద్ర‌బాబు రాజ‌కీయాల్లోకి అలీ వ‌స్తే అండ‌గా వుంటాన‌ని స‌భాముఖంగా మాటిచ్చారు. అలీ ఏం ఆశించాడో అదే జ‌రుగుతుండ‌టంతో టీడీపీలో చేర‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అలీకి గుంటూరు ఈస్ట్ స్థానాన్ని కేటాయించార‌ని, ఇక్క‌డి నుంచే అలీ పోటీకి దిగుతార‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.