వేదిక‌పై కుప్ప‌కూలిన‌ క‌మెడియ‌న్

భారత సంతతికి చెందిన స్టాండప్‌ కమెడియన్‌ మంజునాథ్‌ నాయుడు (36) దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. వేదిక‌పై ప్రదర్శన ఇస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఉన్న ప‌ళంగానే కుప్పకూలారు. ప్రేక్షకులు మాత్రం షోలో భాగంగానే మంజునాథ్‌ పడిపోయారని అనుకున్నారు. కానీ మంజునాథ్‌ లేవకపోవడంతో నిర్వాహకులు వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు.

అప్పటికే మంజునాథ్‌ మృతిచెందినట్లు వైద్యలు నిర్థారించారు. మంజునాథ్‌ అబుదాబిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్‌కు చెందినవారు. . తల్లిదండ్రులు చనిపోవడంతో తన తమ్ముడితో కలిసి మంజునాథ్‌ దుబాయ్ వెళ్లి స్థిర‌ప‌డ్డారు. స్టాండప్‌ కమెడియన్‌గా ప్రదర్శనలు ఇస్తూ జీవిస్తున్నారు. మంజునాథ్‌ మృతిపై పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం తెలిపారు.