క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఇంక మార‌డా..?

Last Updated on by

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నంత మంది క‌మెడియ‌న్లు మ‌రే ఇండ‌స్ట్రీలోనూ లేరు. ఇక్క‌డ హీరోల‌తో స‌మానంగా వాళ్ల‌కు ఇమేజ్ ఉంటుంది. అందుకే వాళ్లు కూడా హీరోలు కావాల‌ని కోరుకుంటారు. అలా అయిన వాళ్లు కూడా లేక‌పోలేరు. రాజ‌బాబు, రేలంగి కాలం నుంచి ఇప్ప‌టి బ్ర‌హ్మి, సునీల్ వ‌ర‌కు అంతా హీరోలైన వాళ్లే. కానీ ఏ ఒక్క‌రు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు స‌క్సెస్ కాలేదు. ఈ మ‌ధ్య ష‌క‌ల‌క శంక‌ర్ కూడా హీరోగా చేసి డిజాస్ట‌ర్ అందుకున్నాడు. ఇక రెండేళ్ల కిందే స‌ప్త‌గిరి కూడా హీరో అయ్యాడు. స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ తో వ‌చ్చిన ఈయ‌న ఆ త‌ర్వాత స‌ప్త‌గిరి ఎల్ఎల్ బి అన్నాడు.

ఈ రెండు సినిమాల్లో మేకోవ‌ర్ బాగానే అయ్యాడు కానీ క‌థ విష‌యంలో ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈయ‌న్ని ప‌ట్టించుకోలేదు. అయితే ఇప్పుడు గ‌జ‌దొంగ‌గా మరోసారి వ‌స్తున్నాడు ఈ క‌మెడియ‌న్. కొత్త ద‌ర్శ‌కుడితో స‌ప్త‌గిరి గ‌జ‌దొంగ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ గ‌జ‌దొంగ‌తో దీనికి సంబంధం లేదని చెప్తున్నాడు స‌ప్త‌గిరి. త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. మూడోసారి హీరోగా ప్ర‌య‌త్నిస్తున్నాడు స‌ప్త‌గిరి. హీరో అయిన త‌ర్వాత క‌మెడియ‌న్ గా కూడా సినిమాలు త‌గ్గించేసాడు ఈయ‌న‌. మొత్తానికి అటూ ఇటూ కాకుండా ఎటు వెళ్తున్నాడో తెలియ‌కుండా ఉన్నాడు స‌ప్త‌గిరి.

User Comments