క‌మెడియ‌న్ రాజేష్‌ హీరోగా..

Last Updated on by

క‌మెడియ‌న్ స‌త్యం రాజేష్ హీరో అవుతున్నాడు. విశ్వామిత్ర అనేది టైటిల్‌. గీతాంజ‌లి ఫేం రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ మాట‌లు అందించారు. హార‌ర్ జోన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కొన్ని నిజ ఘ‌ట‌న‌లే స్ఫూర్తినిచ్చాయ‌ని ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ వెల్ల‌డించారు. అమెరికాలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌కు స్విట్జ‌ర్లాండ్‌లో వేరొక ఘ‌ట‌న‌కు సంబంధం ఏంటి అన్న‌ది తెర‌పై చూడాల‌ని అన్నారు. నిన్న‌టిరోజున విశ్వామిత్ర టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌లో రాజ్‌కిర‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని ముచ్చ‌టించారు.

ఇక‌పోతే క‌మెడియ‌న్లు హీరోలు అవుతున్న ఈ రోజుల్లో వీళ్ల ప‌ప్పులుడ‌క‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. సునీల్, ధ‌న్‌రాజ్, స‌ప్త‌గిరి, శ్రీ‌నివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్ వీళ్లంతా క‌మెడియ‌న్లుగా స‌క్సెసై హీరోలుగా ఆలోచించుకోవాల్సిన స‌న్నివేశంలో ఉన్నారు. ఇప్పుడు స‌త్యం రాజేష్ హీరో అవుతుండ‌డం అది అత‌డి కెరీర్‌కి ఎంత‌వ‌ర‌కూ క‌లిసొస్తుందో.. వేచి చూడాలంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే రాజేష్ వెర్ష‌న్ మాత్రం వేరొక‌లా ఉంది. విశ్వామిత్ర చిత్రంలో నందిత ప్ర‌ధాన పాత్ర‌ధారి. అశుతోష్ రాణా పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉంది. ఆ త‌ర్వాత నేను చేసిన‌ది చిన్న పాటి హీరోయిక్ పాత్ర మాత్ర‌మేన‌ని తెలిపాడు. విశ్వామిత్ర టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

User Comments