Last Updated on by
హాయిగా కమెడియన్ గా చేసుకోక మనకెందుకు వచ్చిన గొడవల్రా ఇవన్నీనూ.. హీరోగా ఎందుకు.. ఏడాదికి పది సినిమాలు చేసుకోక.. ఇవి ఎవరో అన్న మాటలు కావు.. షకలక శంకర్ హీరో అవుతున్నాడంటే తోటి కమెడియన్లు అన్న మాటలే. ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలు కాకూడదనేది ఎక్కడా లేదు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు అయితే పరిస్థితి ఎలా ఉందనేది తెలిసి కూడా అడుగేయడం మాత్రం నిజంగా నేరమే. షకలక శంకర్ హీరోగా శ్రీధర్ తెరకెక్కించిన శంభో శంకర కనీసం మూడు రోజులు కూడా ఆడలేదు.
సునీల్ లాంటి స్టార్ కమెడియన్లే ఇప్పుడు హీరోలుగా చేస్తే చూడటం లేదు ప్రేక్షకులు. అలాంటిది అది కూడా ఓ రొటీన్ సినిమాతో చూస్తారని ఎలా అనుకున్నాడో మరి షకలక శంకర్. ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తే కేవలం ఈ చిత్రాన్ని చూడ్డానికి 8 మంది ప్రేక్షకులు మాత్రమే థియేటర్ కు వచ్చారు. ఆ 8 మంది కూడా ఎలా వచ్చారబ్బా అంటూ ఈ సినిమాపై సెటైర్లు పేలుస్తున్నారు సోషల్ మీడియాలో. కథపై ధ్యాస పెట్టకుండా.. పవన్ భజన ఎక్కువైపోవడంతో శంభో శంకర ఎటూ కాకుండా పోయింది. మొత్తానికి ఈ చిత్రంతో షకలక కాస్తా లకలక అయిపోయింది.
User Comments