శ్రీ‌నివాస్ రెడ్డికి జంబ‌ల‌కిడిపంబే..!

Last Updated on by

క‌మెడియ‌న్లుగా ఉన్న‌పుడు రాజుల్లా ఉంటారు.. రోజుకు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు తీసుకుంటూ హాయిగానే ఉంటారు. పైగా వ‌రస సినిమాలు కూడా ఉంటాయి. అదేం విచిత్ర‌మో తెలియ‌దు కానీ మ‌న క‌మెడియ‌న్ల‌కు ఉన్న‌ట్లుండి హీరో పురుగు కుడుతుంది. ప‌రువు కోసం పోతున్నారో లేదంటే నిజంగానే త‌మలో ఓ హీరో ఉన్నాడ‌నుకుంటున్నారో తెలియ‌దు కానీ బంగారం లాంటి క‌మెడియ‌న్ జాబ్ వ‌దిలేసుకుని అటు వైపు ప‌రుగులు తీస్తున్నారు. ఇలా తీసి ఇప్ప‌టికే చాలా మంది క‌మెడియ‌న్లు ఆరిపోయారు. సునీల్ కూడా ఇప్పుడు మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా వ‌చ్చేసాడు.

ఇప్పుడు శ్రీ‌నివాస్ రెడ్డి కూడా దీనికి మిన‌హాయింపు కాదు. క‌మెడియ‌న్ గా బిజీగా ఉన్న ఈయ‌న ఇప్పుడు హీరోగా మారి త‌న కెరీర్ ను తానే నాశ‌నం చేసుకుంటున్నాడు. గీతాంజ‌లి సినిమా అంజ‌లి వ‌ల్ల ఆడింది కానీ అందులో శ్రీ‌నివాస‌రెడ్డి చేసిందేమీ లేదు. ఇక జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా కూడా డిజాస్ట‌రే. ఇప్పుడు వ‌చ్చిన జంబ‌లకిడిపంబ కూడా డిజాస్ట‌ర్. అన‌వ‌స‌ర‌పు హంగుల‌కు పోయి ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకుంటున్నాడు శ్రీ‌నివాస రెడ్డి అంటూ ఆయ‌న్ని అభిమానించే వాళ్లే అంటున్నారు. హాయిగా క‌మెడియ‌న్ గా న‌టిస్తే అయిపోతుంది క‌దా.. ఎందుకు ఈ హీరో గోల అంటూ ఆయ‌న‌కు స‌ల‌హాలు కూడా ఇస్తున్నారు. మ‌రి వాటిని ఆయ‌న తీసుకుంటాడో లేదో..!

User Comments