సునీల్‌కి ఘోర ప్ర‌మాదం.. ఇదీ నిజం!!

Last Updated on by

హీరోగా సునీల్ శ‌కం ముగిసింది…. త‌ను ఏ సినిమా చేసినా ఆడ‌టం లేదు స‌రిక‌దా కొనేవాళ్లు వుండ‌టం లేదు. దాంతో అత‌నితో సినిమాలు చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దీంతో మ‌ళ్లీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొద‌లుపెట్టాడు. వ‌రుస నినిమాల్లో న‌టిస్తున్నాడు. ఇదిలా వుంటే అత‌నిపై సోష‌ల్ మీడియాలో శుక్ర‌వారం నుంచి రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయి. త‌న‌కి ఘోర ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ప్ర‌మాదంలో సునీల్‌కు తీవ్ర‌గాయ‌ల‌య్యాయ‌ని జోరుగా ప్ర‌చారం ఊపందుకుంది. అయితే ఇది అస‌త్య ప్ర‌చార‌మేన‌ని సునీల్ కొట్టిపారేశారు.

త‌న‌పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారంపై వెంట‌నే తేరుకున్న సునీల్ క్లారిటీ ఇచ్చారు. `నేను ఘోర ప్ర‌మాదానికి గుర‌య్యాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో అస్స‌లు నిజం లేదు. కావాల‌ని ఎవ‌రో త‌మ మీడియా పాపులారిటీని పెంచుకోవ‌డం చేసిన చిల్ల‌ర ప‌ని ఇది. ద‌య‌చేసి ఆ వార్త‌లు ఎవ‌రూ న‌మ్మొద్దు. వాటిని ప్ర‌మాణికంగా తీసుకుని భ‌య‌ప‌డొద్దు. మీ ఆశీస్సుల‌తో నేను మంగానే వున్నాను. ఆరోగ్యంగానే వున్నాను` అని సునీల్ సోష‌ల్ మీడియా ట్వీట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

User Comments