కమెడియన్ విజయ్ కి నిజంగానే హెచ్ ఐ వి ఉందా..?

ఇండ‌స్ట్రీ అంటే కేరాఫ్ వివాదాలు అని మ‌రోసారి నిరూపిత‌మైంది విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌తో. ప‌దేళ్ల కింద వ‌ర‌స‌ సినిమాలు చేసి క‌మెడియ‌న్ గా పేరు తెచ్చుకున్న విజ‌య్.. కొన్ని రోజులుగా తెర‌పై క‌నిపించ‌డ‌మే మానేసాడు. ఉన్న‌ట్లుండి స‌డ‌న్ గా ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుని వార్త‌ల్లో నిలిచాడు ఈ క‌మెడియ‌న్. ఈయ‌న చావుకు ఆర్థిక ఇబ్బందులే కార‌ణం అని చ‌నిపోయిన వెంట‌నే వార్త‌లొచ్చాయి. కానీ అత‌డు ఆర్థికంగా బాగానే ఉన్నాడు.. భార్యా, ఆమె త‌రఫు వాళ్లే విజ‌య్ చావుకు కార‌ణ‌మంటూ వాద‌న‌లు వినిపించాయి. ఇక ఇప్పుడు మ‌రో కొత్త‌కోణం బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సారి విజ‌య్ భార్య వ‌నితా రెడ్డి త‌న‌దైన శైలిలో కొన్ని ఆరోప‌ణ‌లు చేసారు. చ‌నిపోయిన వ్య‌క్తిపై కూడా ఆమె చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే అంద‌రికీ షాక్ అనిపిస్తుంది.

విజ‌య్ సాయి తాను చ‌నిపోవ‌డానికి ముందు సెల్ఫీ వీడియో ఒక‌టి తీసుకున్నాడు. అందులో త‌న చావుకు భార్య వ‌నితారెడ్డి, శ‌శిధ‌ర్ అనే మ‌రో వ్య‌క్తి, అడ్వ‌కేట్ లే కార‌ణం అని.. వాళ్లను ఊరికే వ‌ద‌లొద్దంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఆత్మ‌హ‌త్య‌పై విజ‌య్ సాయి వనితా రెడ్డి వాదన మరోలా ఉంది. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆమె విజయ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త ఆత్మహత్యపై అనుమానాలున్నాయని అన్నారు. తాను విజయ్ ను బెదిరించలేదన్నారు. తామిద్దరం రెండేళ్లుగా విడిపోయి బతుకుతున్నామని.. ఇప్పుడు ఇంత స‌డ‌న్ గా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియ‌డం లేద‌న్నారు. రెండేళ్లుగా కోర్టులో తమ విడాకుల కేసు న‌డుస్తుంద‌న్నారు వ‌నితారెడ్డి. అంతే కాదు.. విజయ్ కు వేరే అమ్మాయితో అక్ర‌మ సంబంధం ఉందని.. ఆ విషయంపై ప్రశ్నించడంతో తమ మధ్య గొడవలొచ్చాయ‌ని చెప్పింది వనిత‌. విజయ్ తండ్రికి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదన్నారు.

తాము విడిపోయాక రెండేళ్ల క్రితమే ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని.. ఇపుడు ఆమెను కూడా వదిలేశాడని చెప్పింది విజ‌య్ మాజీ భార్య‌. తనను విజయ్ ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడని.. వాటి గురించి తాను ఎన్నడూ బయట చెప్పుకోలేదని తెలిపారు. పిల్లలు వద్దని తనను వేధించాడని.. మూడుసార్లు అబార్షన్ కూడా చేయించాడని.. చివరకు వాళ్ల నాన్నతో చెప్పి బతిమిలాడితే విజయ్ ఒప్పుకున్నాడని చెప్పారు. విజయ్ కు తన తండ్రితో ఆస్తి తగాదాలున్నాయని చెప్పారు. ఆ కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కొత్త కోణం బ‌య‌టికి చెప్పింది వ‌నిత రెడ్డి.

అవి మాత్ర‌మే కాదు.. విజ‌య్ సాయికి ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని సంచ‌ల‌నం సృష్టించింది వ‌నిత రెడ్డి. చాలా రోజులుగా విజయ్ కు హెచ్ఐవీ ఉందని తాను ఎన్నో రోజులు బ‌త‌క‌న‌ని విజయ్ త‌న‌కు చెబుతుండేవాడని చెప్పింది ఈమె. హెచ్ఐవీ ఉన్న విషయాన్ని ఆయనతో శారీరక సంబంధం పెట్టుకున్న అమ్మాయి కూడా చెప్పిందన్నారు. ఆత్మహత్యకు అది కూడా ఒక కారణం కావచ్చన్నారు. తాను బయటకు వచ్చేసిన తరువాత ఈ విషయం తెలిసిందన్నారు. ఇలా ఒక్క చావుపై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కావాల్సిన‌న్ని కోణాలు బ‌య‌టికి వినిపిస్తున్నాయి. మ‌రోవైపు సెల్ఫీ వీడియోలో మాత్రం దోషులు భార్య‌, మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు అని చెప్పాడు విజ‌య్. మ‌రి ఈ కేస్ ఇంకా ఎన్ని మ‌లుపు తిర‌గ బోతుందో..?