టాప్ స్టోరి: క‌మెడియ‌న్లు ఫ్లాప్ హీరోలు

Last Updated on by

క‌మెడియ‌న్లు హీరోలు అవ్వ‌డం అన్న ట్రెండ్ కొత్తేం కాదు. నాటిరోజుల్లో రాజ‌బాబు, ప‌ద్మ‌నాభం, అల్లు రామ‌లింగ‌య్య‌, రేలంగి ఏ సినిమాల్లో న‌టించినా వాళ్ల‌ను హీరోల్లానే ఆరాధించేవారు ప్రేక్ష‌క‌జ‌నం. ఆ త‌ర‌వాత సుత్తి వీర‌భ‌ద్రం, బ్ర‌హ్మానందం, అలీ, వేణుమాధ‌వ్ వీళ్లంతా హీరోల‌య్యారు. అయితే వీళ్లంద‌రి గేమ్ కొన్నాళ్లే సాగింది. టాలీవుడ్‌కి పూర్తి స్థాయి కామెడీ హీరో అంటే కేవ‌లం న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ పేరు మాత్ర‌మే సుస్థిరంగా చ‌రిత్ర‌లో మిగిలింది.

అయితే రాజేంద్రుని స్ఫూర్తితో ఎంద‌రో కామెడీ హీరోలుగా స్థిర‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నించి బొక్క బోర్లా ప‌డ్డారు. రాజేంద్ర ప్ర‌సాద్‌కి ఆల్ట‌ర్నేట్ హీరోగా బ‌రిలో దిగిన అల్ల‌రి న‌రేష్ కొంత‌వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు. కానీ ఇటీవ‌ల అన్నీ ఫ్లాపులే ఎదుర‌య్యాయి. వ‌రుస‌గా అర‌డ‌జ‌ను ఫ్లాపులు రావ‌డంతో ప్ర‌స్తుతం కెరీర్‌ని రెన్యువ‌ల్ చేయాల్సిన స‌న్నివేశం నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే సునీల్‌తో `సిల్లీ ఫెలోస్‌` అనే మ‌ల్టీస్టార‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇక‌పోతే క‌మెడియ‌న్ సునీల్ స‌న్నివేశం తెలిసిందే. బాన పొట్ట త‌గ్గించి 6ప్యాక్ హీరోగా మారిన సునీల్ తొలుత ఓకే అనిపించాడు. అయితే ఇటీవ‌ల‌ కొన్ని వ‌రుస డిజాస్ట‌ర్లు సునీల్‌కి గుక్క‌తిప్పుకోనీకుండా చేశాయి. హీరోగా ఛాన్సులిచ్చేవాళ్లున్నారు కాబ‌ట్టి బండి గ‌తుకుల రోడ్‌లో అలా అలా న‌డిచేస్తోంది. సునీల్ హీరోయిజం కేవలం మూడు నాలుగు సినిమాల వ‌రకే ప‌రిమిత‌మైంది. ఇత‌ర కామెడీ హీరోలు సోసోగానే ర‌న్ చేస్తున్నారు. శ్రీ‌నివాస‌రెడ్డి కామెడీ వేషాలు వేస్తూనే హీరోగా అప్పుడ‌ప్పుడు సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ మూవీ `జంబ‌ల‌కిడి పంబ‌` ప్లాప్ షోనే అయ్యింది. ఇక‌పోతే స‌ప్త‌గిరి కమెడియ‌న్‌గా ఓ వెలుగు వెలిగి – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమా యావ‌రేజ్ అయినా, త‌ర్వాత‌ సీక్వెల్ ఫ్లాపవ్వ‌డంతో కెరీర్ డైలెమ్మాలో ప‌డింది. అయితే ఇలా హీరోలై ఫ్లాపులొస్తున్నా వీళ్ల‌లో ఎందుక‌నో రియ‌లైజేష‌న్ క‌నిపిస్తున్న‌ట్టు లేదు. ఇంకా ఇంకా హీరోయిజ‌మ్‌నే న‌మ్ముకుని, ఆ హ్యాంగోవ‌ర్‌నే కొన‌సాగిస్తున్నారు. స‌రిగ్గా ఇలాంటి టైమ్‌లో ఒక‌డొచ్చాడు. ఆడే ష‌క‌ల‌క శంక‌ర్‌. శ్రీ‌కాకుళం టు హైద‌రాబాద్ అత‌డి ప‌య‌నం ఇంట్రెస్టింగ్‌. ఇప్పుడే ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా.. హిట్టా ఫ‌ట్టా? అనేది నిర్ణ‌యించ‌లేమ‌ని నిన్న‌నే ఓ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో చెప్పాడు. శంక‌ర్ న‌టించిన `శంభో శంక‌ర‌` కేవ‌లం ఓ విలేజీలో.. ఎంతో ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించి తెలివిగా బిజినెస్ చేశార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ సోమ‌వారినికి కానీ క్లారిటీ రాదు. అయితే హీరోల‌య్యాక ఫ్లాపులొస్తున్నా ఇంకా హీరోగానే కొనసాగాల‌న్న బింకం ఎందుకో వారే అనుభ‌వంతో చెప్పాల్సి ఉంటుంది.

User Comments