ర‌ణ్ బీర్.. అనుష్క‌పై పోలీస్ కేస్..!

Last Updated on by

ఈ రోజుల్లో పెద్ద సినిమా విడుద‌ల‌వుతుందంటే చాలు.. వ‌ద్ద‌న్నా కూడా వివాదాలు వెంట‌బ‌డి మ‌రీ వ‌స్తుంటాయి. ఇప్పుడు సంజూ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ట్రైల‌ర్ విడుద‌లైన 20 రోజుల త‌ర్వాత ఓ సీన్ పై పోలీస్ కేస్ పెట్టారు. అది కూడా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు.. నిర్మాత‌పై కాదు.. అందులో న‌టించిన ర‌ణ్ బీర్, అనుష్క శ‌ర్మ‌పై. అస‌లు లాజిక్ లేని ఈ కేస్ ఇప్పుడు సెక్స్ వ‌ర్క‌ర్ల నుంచి వ‌చ్చింది. సంజూ ట్రైల‌ర్ లో ఓ సీన్ లో అనుష్క‌.. ర‌ణ్ బీర్ మ‌ధ్య వ‌చ్చే డిస్క‌ష‌న్ లో నీ భార్య‌తో కాకుండా ఎంత‌మంది అమ్మాయిల‌తో ప‌డుకున్నావ్ అని అడుగుతుంది. ఆ సీన్ లో సంజూ భార్య మాన్య‌త‌గా న‌టించిన దియామీర్జా కూడా ఉంటుంది. దానికి సంజ‌య్ ద‌త్ క్యారెక్ట‌ర్ అంటే ర‌ణ్ బీర్ అంటాడు.. అందులో వ్య‌భిచారినిల‌ను తీసి చెప్పాలా.. లేదంటే క‌లుపుకుని చెప్పాలా అని..? ఇదే ఇప్పుడు సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు కోపం తెప్పిస్తుంది. సెక్స్ వ‌ర్కర్ల‌ను త‌క్కువ చేసి మాట్లాడినందుకు ఈ సినిమాపై కేస్ ఫైల్ అయింది.

దీనికంటే ముందు కూడా ఓ కేస్ సంజూపై ఫైల్ అయింది. కొంప‌దీసి ఏ వివాదం లేకుండానే సంజూ విడుద‌ల‌వుతుందా అనుకుంటున్న త‌రుణంలో వ‌ర‌స‌గా వివాదాలు చుట్టుముడుతున్నాయి ఈ చిత్రంపై. ట్రైల‌ర్ చూసిన ఇన్ని రోజుల త‌ర్వాత సామాజిక కార్య‌క‌ర్త పృథ్వీ త‌న మ‌నోభా వాలు దెబ్బ‌తిన్నాయంటూ కోర్ట్ ను ఆశ్ర‌యించాడు. ట్రైల‌ర్ లో సంజ‌య్ జైల్లో ఉన్న‌పుడు బాత్రూమ్ వాట‌ర్ బ‌య‌టికి రావ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. ఈ సన్నివేశాన్ని వెంట‌నే తొలగించాలని సామాజిక కార్యకర్త డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు అత‌డు సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషికి లెట‌ర్ కూడా రాసాడు. ఇప్ప‌టి వ‌ర‌కు తాను పొందిన స‌మాచారం ప్ర‌కారం ఏ జైల్లో కూడా ఇంత దారుణ‌మైన సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని.. జైలు నిర్వహణలో ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారని పృథ్వీ తన లేఖలో రాసాడు. మొత్తానికి సంజూ విడుద‌ల‌కు చేరువ‌వుతుంటే ఇలాంటి కేస్ లు ఇంకెన్ని వ‌చ్చి ఫైల్ అవుతాయో చూడాలి..! జూన్ 29న విడుదల కానుంది ఈ చిత్రం.

User Comments