చిరు-చ‌ర‌ణ్ ల‌పై స్టేష‌న్లో ఫిర్యాదు

మెగాస్టార్ చిరంజీవి క‌థ‌నాయ‌కుడిగా రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న సైరా న‌ర‌సింహారెడ్డి వివాదంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వంశీయులు త‌మ‌ను మోసం చేసారని ఆరోపించ‌డం…దానిపై చ‌ర‌ణ్ వివ‌ర‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది. అయినా ఆ వంశీయులు చిరు-చ‌ర‌ణ్ ల‌ను వ‌దిలిపెట్ట‌లేదు. డ‌బ్బులు కోస‌మో..ప్ర‌చారం కోస‌మే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన‌ట్లు తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది.

తాజాగా జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో త‌మ నుంచి క‌థ తీసుకుని మోసం చేసార‌ని ఫిర్యాదు చేసారు. అయితే పోలీసులు కేసు న‌మోదు చేసారా? లేదా? అన్న‌ది పోలీసులు వెల్ల‌డిస్తే గానీ తెలియ‌దు. చ‌ట్ట‌బ‌ద్దంగా 100 ఏళ్లు దాటిన ప్ర‌ముఖుల క‌థ‌ల‌ను స్వేచ్ఛ‌గా సినిమా చేయోచ్చు. చ‌ట్ట‌ప‌రంగా అందులో ఎలాంటి లొసుగులు లేవని చ‌ర‌ణ్ క్లారిటీ ఇచ్చారు. అయినా ఇటీవ‌ల తెలుగు సినిమా ను కొంత మంది అన‌వ‌స‌రంగా టార్గెట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.