బన్నీ- మురుగదాస్ కాంబో.. కన్ఫర్మ్

మురుగదాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్. – ఈ మాట యేడాది కాలంగా టాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే అటు మురుగ కానీ, ఇటు బన్నీ కానీ, లేదంటే గీతా ఆర్ట్స్ వర్గాలు కానీ ఈ వార్తని ధృవీకరించలేదు. మొన్న`దర్బార్` ప్రమోషన్స్‌కి వచ్చిన మురుగదాస్ కూడా ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదన్నాడు. కానీ బన్నీ మాత్రం ఈ కాంబోలో సినిమా ఉంటుందని, మా మధ్య చర్చలు కూడా జరిగాయని చెప్పారు. `అల.. వైకుంఠపురములో` చిత్రంతో సందడి చేయబోతున్న బన్నీ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇంగ్లిష్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఇలా నేషనల్ వైడ్‌గా మీడియాని ఆహ్వానించి, ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇదే తొలిసారి. భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలు చేయడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన మురుగదాస్‌తో సినిమా ఉండే అవకాశాలున్నాయని, అన్నీ అనుకున్నట్టు జరిగే ఆ చిత్రం పక్కాగా సెట్స్‌పైకి వెళుతుందని స్పష్టం చేశారు. అయితే బన్నీ తదుపరి సుక్కుతో పాటు, ఐకాన్ అనే సినిమా కూడా చేయాల్సి ఉంది. మరి ఆ రెండూ పూర్తయ్యాకే మురుగదాస్‌తో సినిమా ఉంటుందా లేక సుకుమార్ సినిమా తర్వాత పట్టాలెక్కిస్తారా అనేది చూడాలి.