వ‌ర్మ ఇంక మారాడా..?

Last Updated on by

త‌న‌కు న‌చ్చింది చేస్తా.. వ‌చ్చింది తీస్తా.. చూస్తే చూడు లేక‌పోతే చావు.. ఇదే వ‌ర్మ‌కు తెలిసిన మంత్రం. ట్రెండ్ మారుతున్నా.. జ‌న‌రేష‌న్ మారినా ఇప్ప‌టికీ త‌న‌కు తెలిసిందే సినిమా అంటాడు. క‌రెక్టే.. ఇండియ‌న్ సినిమా గ‌తిని మార్చేసిన ద‌ర్శ‌కుల్లో వ‌ర్మ కూడా ఒక‌డు. ఒప్పుకుని తీరాలి.. కానీ ఇప్ప‌టికీ అదే ట్రెండ్ ఫాలో అవుతానంటే ఎలా..? ఇప్పుడు సింపుల్ లెక్క‌.. మార్కెట్ లోకి ఎన్నో కొత్త బండ్లు వస్తుంటే ఇప్ప‌టికీ అదే పాత లూనాను న‌డ‌ప‌మంటే ఎవ‌రైనా న‌డుపుతారా..? అప్పుడు ప‌నికొచ్చింది క‌దా అని ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటారా లేదు క‌దా.. మూల‌నే ప‌డేస్తారు.

ఇప్పుడు వ‌ర్మ కూడా త‌న‌ను తాను అప్ డేట్ చేసుకోలేక‌.. త‌న‌కు ఇదే వ‌చ్చు ఇదే తీస్తానంటున్నాడు. ఒక‌టి రెండు అంటే ఏమో అనుకోవ‌చ్చు ప‌దేళ్లుగా ఈ ద‌ర్శ‌కుడి నుంచి చెప్పుకోద‌గ్గ సినిమా రాలేదంటే ఏమిటి అర్థం..? ఇప్పుడు ఎంతో న‌మ్మి నాగార్జున అవ‌కాశం ఇస్తే దాన్ని కూడా తీసుకెళ్లి ముంబై స‌ముద్రంలో క‌లిపేసాడు. ఆఫీస‌ర్ కూడా తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం నిల‌బ‌డే అవ‌కాశాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. చూడాలిక‌.. ఈ ప‌రిస్థితుల్లో వ‌ర్మ‌ను ఎవ‌రు న‌మ్ముతారో..? మ‌ళ్లీ అవ‌కాశం ఎందుకు ఇస్తారో..?

User Comments