సంక్రాంతి 2018.. క‌న్ఫ్యూజ‌న్ క‌న్ఫ్యూజ‌న్.. 

నిన్న‌టి వ‌ర‌కు అంతా క్లారిటీగానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా క‌న్ఫ్యూజింగ్ గానే క‌నిపిస్తుంది. అన్ని బెర్తులు క‌న్ఫ‌ర్మ్ అనుకున‌న‌ది కాస్తా.. ఇప్పుడు ఎటు చూసినా క‌న్ఫ్యూజ‌నే క‌నిపిస్తుంది. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వ‌స్తున్నాయ‌నే విష‌యంపై పెద్ద చ‌ర్చే న‌డుస్తుంది. టాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్ ఫుల్ సీజ‌న్స్ లో సంక్రాంతి ఒక‌టి. అప్పుడు వ‌చ్చిన సినిమాలు కాస్త యావ‌రేజ్ గా ఉన్నా కూడా అదిరిపోయేలా కలెక్ష‌న్లు సాధిస్తాయి. అందుకే హీరోలంద‌రి దృష్టి ఈ పండ‌గ‌పైనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. పండ‌క్కి ఇంకా మూడు నెల‌లే టైమ్ ఉండ‌టంతో హీరోలు ఒక్కొక్క‌రుగా బెర్తులు క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ సినిమా పండ‌క్కే రానుంది. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప‌వ‌న్ కంటే ముందే మ‌హేశ్ భ‌ర‌త్ అను నేను అంటూ పొంగ‌ల్ బెర్త్ క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం సంక్రాంతికి వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ 30 శాతం కూడా పూర్తి కాలేదు. న‌వంబ‌ర్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు కొర‌టాల శివ‌. ఎంత వేగంగా పూర్తి చేసినా.. పండ‌క్కి విడుద‌ల చేయ‌డం మాత్రం కాస్త క‌ష్ట‌మే అని తెలుస్తోంది. ఇక రంగ‌స్థ‌లం షూటింగ్ న‌వంబ‌ర్ లోనే పూర్తి కానుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతికే వ‌స్తుందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ చూస్తూ చూస్తూ బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే అబ్బాయి పోటీగా వ‌స్తాడా అనేది అనుమాన‌మే. ఇప్ప‌టికే బాబాయ్ సినిమాకు తాను పోటీగా రాలేన‌ని.. స‌మ్మ‌ర్ కు సినిమా వాయిదా వేస్తే మంచిద‌ని చిత్ర‌యూనిట్ కు రామ్ చ‌ర‌ణ్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇక బాల‌య్య మాత్రం సంక్రాంతికే వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తోన్న చిత్ర షూటింగ్ సూప‌ర్ ఫాస్ట్ గా జ‌రుగుతుంది. ఇందులో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు. న‌య‌న‌తార మూడో సారి బాల‌య్య‌కు జోడీగా న‌టిస్తుంది. మొత్తానికి బాల‌య్య‌, ప‌వ‌న్ క‌న్ఫ‌ర్మ్.. చ‌ర‌ణ్, మ‌హేశ్ మాత్రం క‌న్ఫ్యూజ‌న్. మ‌రి దీనికి క్లారిటీ ఎప్పుడు రానుందో..?