ఎన్టీఆర్ ఇంట‌ సందడి షురూ

త్వ‌ర‌లోనే నంద‌మూరి కుటుంబంలోకి మ‌రో కొత్త రూపం రాబోతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు సీక్రేట్ గానే ఉంది. కానీ ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా ఎన్టీఆర్ ఇంటికి బంధువుల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌టంతో విష‌యం ఏంట్రా అని ఆరా తీస్తే ఎన్టీఆర్ మ‌ళ్లీ తండ్రి కానున్నాడ‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న భార్య లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఆరు నెలల గర్బవతి. మ‌రో మూడు నెల‌ల్లో ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతుంది. నంద‌మూరి ఇంట చిన్నారి మే లో వ‌చ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఇప్ప‌టికే ఎన్టీఆర్-ల‌క్ష్మీప్ర‌ణ‌తి జంట‌కు ఓ అబ్బాయి ఉన్నాడు. నాలుగేళ్ల కింద వీళ్ల‌కు ఈ కుర్రాడు జ‌న్మించాడు. అత‌డి పేరు అభ‌య్ రామ్.

2011లో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని పెళ్లి చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు వాళ్ళ‌కు మ‌రో బాబో, పాపో రాబోతున్నారు. నంద‌మూరి అభిమానులు పండ‌గ‌లా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఈ న్యూస్ ను. ఇప్ప‌టి వ‌ర‌కు సీక్రేట్ గానే ఉన్న ఈ విష‌యాన్ని త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నాడు. మ‌రోవైపు సినిమాల విష‌యంలోనూ ఎన్టీఆర్ చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయ‌న‌. మార్చ్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతుంది. ఇక రాజమౌళి సినిమా అక్టోబ‌ర్ నుంచి మొద‌లు కానుంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్ట‌నున్నాడు జూనియ‌ర్. మొత్తానికి.. ఎన్టీఆర్ ఇంట మ‌ళ్లీ వార‌సుడే రానున్నాడో.. లేదంటే వార‌సురాలే వ‌స్తుందో..?

User Comments