విశాల్‌పై భారీ కుట్ర‌?

Last Updated on by

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌హాల్ హీరో విశాల్‌కి త‌మిళ‌నాట ప్ర‌త్యేక ఫాలోయింగ్ ఉంది. ఆప‌న్నులకు సాయం చేసే హీరోగా అత‌డికి మంచి పేరుంది. ఇటీవ‌ల త‌మిళ రైతుల‌కు క‌ష్టాల్లో అండ‌గా నిలిచాడు. తంబీల‌ త‌ర‌పున పోరాడేందుకు దిల్లీ వ‌ర‌కూ వెళ్లాడు. ప్ర‌కృతి విల‌యాల్లో త‌మిళ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచాడు. మొన్న‌టి కావేరీ జ‌లాల వివాదంలోనూ తమిళుల‌కు అండ‌గా నిలిచాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు  అభిమానులకు బాగా చేరువ‌య్యాడు. అయితే తాజాగా విశాల్‌ చుట్టూ పొలిటిక‌ల్‌గా ఉచ్చు బిగుస్తోంది. భాజ‌పా-ఎన్డీయే వ్య‌తిరేకిగా అత‌డిపై ప్ర‌భుత్వ‌మే క‌క్ష క‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఏ క్ష‌ణాన అయినా అత‌డి శ‌త్రువులు.. దాడికి దిగే అవ‌కాశం  ఉందని అర్థ‌మ‌వుతోంది. దీంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అత‌ని ఇంటికి పోలీస్ భ‌ద్ర‌త ఏర్పాటు చేసింది. విశాల్ ఉంటున్న‌ ఏరియాలో 144 సెక్ష‌న్ విధించ‌డం హాట్ టాపిక్ అయ్యింది.
విశాల్ న‌టించిన‌ `ఇరుంబుతిరై`  ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక స‌న్నివేశాలు అట్టుడికిస్తున్నాయి. ఆధార్ కార్డు, జీఎస్టీ త‌దిత‌రాల‌పై వివాదాస్ప‌ద స‌న్నివేశాల్ని చూపించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ డిజిట‌ల్ ఇండియా ప‌థ‌కం గురించి ఇందులో విమ‌ర్శించారని, అలాగే ఆధార్ కార్డు పై  జోకులు వేశార‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి.  అందువ‌ల్ల ఈ సినిమా నిలిపివేయాల‌ని మ‌ద్రాసు హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లైంది.  అయితే కోర్టుల ప‌రిధిలో విశాల్‌కి అనుకూలంగానే తీర్పు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో సినిమా రిలీజైనా.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు హిందూ సంస్థ‌లు విశాల్ ఇంటిని ముట్ట‌డించి హెచ్చ‌రిక‌లు జారీ చేసాయి. దీంతో విశాల్ ఇంటికి భ‌ద్ర‌త క‌ల్పించాల్సి వ‌చ్చింది. అస‌లింత‌కీ `ఇరుంబు తిరై`లో వివాదం ఏంటి? అని వివ‌రంగా ప‌రిశీలిస్తే… ఇండియ‌న్ ఆధార్ కార్డ్‌ సిస్ట‌మ్ సునాయాసంగా హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని ఆ మ‌ధ్య ఓ ఆమెరిక‌న్ హ్యాకర్ హెచ్చ‌రించాడు. అదే గ‌నుక జ‌రిగితే భార‌త్ కు భారీగానే దెబ్బ‌ప‌డేది. దీంతో  ప్ర‌భుత్వం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఆ హ్యాక‌ర్ ను పిలిపించి ఆధార్ ఆన్‌లైన్ త‌ప్పిదాల్ని స‌వ‌రించి…అప్ డేట్ చేసింది. ప్ర‌భుత్వంలోని ఇలాంటి లోపాల‌ను ఎత్తిచూపుతూ,  కొన్ని స‌న్నివేశాలు ఉన్నాయిట‌. ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ఆధార్ ప‌ట్ల ఎంత అశ్రద్ద‌గా ఉంద‌న్న అంశాన్ని కూడా సినిమాలో చ‌ర్చించ‌డంతో విశాల్‌కి తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికైతే విశాల్ ఉంటున్న ఏరియాలో భారీ భ‌ద్ర‌తను ఏర్పాటు చేయ‌డం వేడెక్కిస్తోంది. రాజు త‌లుచుకుంటే భంటుకి దెబ్బ‌లు కొద‌వా? అన్న చందంగా విశాల్‌పై ప్ర‌భుత్వ‌మే కుట్ర చేయ‌డం చూస్తుంటే అత‌డి ప్రాధాన్య‌త ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

User Comments