శ్రీ‌రెడ్డికి కలిసొచ్చిన అదృష్టం

Last Updated on by

ఒక్కోసారి అంతే..! అలా క‌లిసొస్తుంది అదృష్టం. ఇప్పుడు శ్రీ‌రెడ్డి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఇన్నాళ్లూ ఆమెను తిట్టిన వాళ్లే ఇప్పుడు అమ్మో ఈ పిల్ల చెప్పింది నిజ‌మే అనుకుంటున్నారు. అమ్మాయిగారి సుడేంటో కానీ ఇండ‌స్ట్రీ ద‌రిద్రం కూడా ఇప్పుడు ఇలాగే త‌గ‌ల‌బ‌డింది. కొన్ని రోజులుగా శ్రీ‌రెడ్డి ఎందుకో తెలియ‌దు కానీ సైలెంట్ అయిపోయింది. అదే స‌మ‌యంలో చికాగో సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డింది. ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ల‌తో పాటు యాంక‌ర్ల పేర్లు కూడా ఇందులో బ‌య‌ట‌ప‌డ్డాయి. దాంతో పండ‌గ చేసుకుంటుంది శ్రీ‌రెడ్డి. ఇన్నాళ్ళూ నేను చెబితే న‌మ్మ‌లేదు.. ఇప్పుడేం అంటారు బాబూ అంటూ సెటైర్లు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికితోడు ట్విట్ట‌ర్లో ర‌చ్చ ఇంకా పెంచేసింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 36 మంది లిస్ట్ వేసి అంద‌రి పేర్లు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది శ్రీ‌రెడ్డి. అస‌లు ఇంత ధైర్యంగా పేర్లు ఎలా బ‌య‌ట‌పెడుతుందో మ‌రి ఆమెకే తెలియాలి.

చికాగో రాకెట్ బ‌య‌టికి రావ‌డానికి కార‌ణం కూడా తానే అంటుంది ఈ భామ‌. శ్రీ‌రెడ్డి చెబుతున్న‌ది కాస్త ఓవ‌ర్ గా ఉంది కానీ ఆమె అదృష్టం కొద్దీ ఈ ర‌చ్చ న‌డుస్తున్న టైమ్ లోనే చికాగో సెక్స్ రాకెట్ బ‌య‌టికి వ‌చ్చింది. అందులో చాలా మంది ప్ర‌ముఖ హీరోయిన్ల పేర్లు కూడా బ‌య‌ట‌ప‌డటం ఇప్పుడు కొత్త సంచ‌ల‌నాల‌కు తావిస్తుంది. మ‌రీ ముఖ్యంగా ర‌కుల్ పేరు పెట్టి మ‌రీ శ్రీ‌రెడ్డి ఆరోపించింది. అమెరికాలోని కిష‌న్ మూగ‌మూడి దంప‌తుల‌కు ఎందుకు ర‌కుల్ నువ్వు థ్యాంక్స్ చెప్పావంటూ ప్ర‌శ్నించింది శ్రీ‌రెడ్డి. ఇన్ని రోజులు తాను సైలెంట్ గా ఉండ‌టానికి కార‌ణం ఇల్లు మారుతుండ‌ట‌మే అని చెప్పుకొచ్చింది ఈ భామ‌. త‌న ఓన‌ర్ ఇల్లు ఖాళీ చేయ‌మ‌ని చెప్పాడ‌ని.. ఆ హ‌డావిడిలోనే ఇన్నాళ్లూ తాను సైలెంట్ అయ్యానే కానీ ఎవ‌రికీ భ‌య‌ప‌డి కాద‌ని చెబుతుంది శ్రీ‌రెడ్డి. అయినా తాను ఇక్క‌డ భ‌య‌ప‌డేంత ప‌ర్స‌నాలిటీలు ఎవ‌రూ లేర‌ని.. అంతా దొంగ‌లే అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

User Comments