త‌మ్మున్ని త‌న్ని.. అన్న‌ను దువ్వుతుంది..

Last Updated on by

ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఆమె ఒక్క ట్వీట్ చేసినా కూడా ఏం చేస్తుందా అని చూడ్డానికి వేల క‌ళ్లు వేచి చూస్తున్నాయి. ఇలాంట టైమ్ లో ఈమె నుంచి ఓ ఊహించ‌ని ట్వీట్ వ‌చ్చింది. అది కూడా రానా గురించి. ఇప్ప‌టికే ద‌గ్గుపాటి కుటుంబానికి శ్రీ‌రెడ్డి భారీ షాకులే ఇచ్చింది. రానా త‌మ్ముడు అభిరామ్ తో త‌న‌కు ఎఫైర్ ఉంద‌ని.. అత‌డితో ప‌డుకున్నాన‌ని కూడా చెప్పింది ఈ భామ‌. ఈ క్ర‌మంలోనే సురేష్ బాబును మామ ఆరోగ్యం జాగ్ర‌త్త‌.. ఎండ ల‌కు వెళ్ల‌కంటూ వ్యంగ్యంగా మాట్లాడింది కూడా.

ఈ ఇద్ద‌ర్ని ఇలా సంబోధించిన శ్రీ‌రెడ్డి.. రానాను మాత్రం చాలా గౌర‌వంగా ప‌ల‌క‌రించ‌డం విశేషం. రానా సార్ ఆరోగ్యం బాలేద‌ని విన్నాను.. ఆయ‌న‌కు అంతా మంచి జ‌ర‌గాలి.. త్వ‌రగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ చాలా సాఫ్ట్ గా పాజిటివ్ గా ఓ ట్వీట్ వేసింది. ఇదే ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. రానాకు ఇంత మ‌ర్యాద ఎందుకు ఇచ్చింద‌బ్బా అనుకుంటున్నారంతా. పైగా ఇన్నాళ్ల‌లో ఎక్క‌డా రానాను ఏ చిన్న మాట కూడా అన‌లేదు శ్రీ‌రెడ్డి. మొత్తానికి త‌మ్మున్ని త‌న్ని.. అన్న‌ను దువ్వ‌డం అంటే ఇదే మ‌రి.

User Comments