తేజపై రూమర్లు.. ఎంతవరకు నిజమో..!

కెరీర్ స్టార్టింగ్ లో ఓ వెలుగు వెలిగి తర్వాత చాలా ఏళ్ళు డీలా పడిపోయిన దర్శకుడు తేజ ఎట్టకేలకు ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి హిట్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి తేజపై సరికొత్తగా రూమర్లు వెల్లువెత్తుతుండటం మాత్రం షాకింగ్ న్యూస్ అవుతుంది. స్వతహాగా తేజ తన కథలను తానే రాసుకుంటాడనే విషయం తెలిసే ఉంటుంది. అలాగే రాసుకున్న కథలను ఆయన డెవలప్ చేసుకొని సినిమా చేస్తాడు. ఈ క్రమంలోనే చాలా కాలం నుంచి హిట్స్ లేక అల్లాడుతున్న తేజాకు ఒక మంచి హిట్ వచ్చింది.
రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ అయింది. కానీ, ఈ సినిమా హిట్ తరువాత తేజపై రూమర్లు వస్తుండటం గమనార్హం. నేనేరాజు నేనే మంత్రి కథ తేజ సొంతం కాదని, ఓ రైటర్ ఎవరో రాశారని, లైన్ నచ్చడంతో.. తనతో ట్రావెల్ చేయమని తేజా చెప్పాడని.. అయితే, పూర్తి స్క్రిప్ట్ పూర్తయ్యాక సదరు రైటర్ ను పక్కన పెట్టాడని సినీ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రానాను హీరోగా తీసుకున్నాక.. ఆ రైటర్ గురించి పట్టించుకోవడం మానేశాడట తేజ. అంతేకాకుండా ముందుగా క్రెడిట్స్ తో పాటు రెమ్యునరేషన్ కూడా ఇప్పిస్తానని చెప్పిన తేజ చివరకు ఆ రైటర్ కు హ్యాండ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
మరోవైపు, ఆ ఘోస్ట్ రైటర్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో బయటకు రావడం లేదని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీమంతుడు సినిమా కూడా తనదే అంటూ ఓ రచయిత కోర్ట్ లో పిల్ దాఖలు చేశాడు.  ప్రస్తుతం దానిపై వాదనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిరు ఖైదీ నెంబర్ 150 పైన కూడా వివాదం చెలరేగింది.  అది ఏదోలా సెటిల్ అయిందనుకోండి. ఒక రచయిత కష్టపడి రాసిన కథలను మరో వ్యక్తి కాపీకొట్టి సినిమా తీయడం అన్నది మంచిది కాదని, ఒకవేళ అలా చేయాల్సి వస్తే తప్పకుండా అతని పేరు వేయాలని ఈ సందర్బంగా రచయితలు అంటున్నారు. మరి తేజ విషయంలో ఇది నిజమేనా లేక ఫైనల్ గా హిట్ తో నిలబడ్డ తేజను ఎవరైనా టార్గెట్ చేసి రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.