ఇండియాలోనే కాస్ట్‌లీ కార్ ఛేజ్

Last Updated on by

ఇది అలాంటిలాంటి కార్ ఛేజ్ కాదు! స్ట‌న్న‌యిపోతారు!! ఇండియాలోనే అస‌లు ఇలాంటి కార్ ఛేజ్ అన్న‌దే చూడ‌లేదు అని అంగీక‌రిస్తారు. సినిమా హిస్ట‌రీలో వెతికి వేసారిపోయేంత‌టి గ్రేట్ యాక్ష‌న్ ఎపిసోడ్ ఇది..

ఇంత‌కీ అంత‌గా స్ట‌న్న‌యిపోయే కార్ ఛేజ్‌.. యాక్ష‌న్ సీన్ ఏ చిత్రంలో ఉంటుంది? అంటే.. ఇంకేమాత్రం సందేహం అఖ్క‌ర్లేదు. ప్ర‌భాస్ – సుజీత్ క‌ల‌యిక‌లో ఈ ఫీట్ సాధ్యం కాబోతోంది. అస‌లు బాలీవుడ్‌లో సైతం ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌ని రేంజులో ఈ సీన్ ఉంటుందిట‌. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్‌లో ట్రాన్స్ ఫార్మ‌ర్స్ యాక్ష‌న్ సీన్ రేంజులో ఉంటుందేమో.. లేదూ జేమ్స్ బాండ్ కార్ ఛేజ్ త‌ర‌హాలోనో.. మ్యాట్రిక్స్‌లో కార్ ఛేజ్‌.. డెత్ రేస్‌.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ రేంజ్ అని స్పాట్ నుంచి స‌మాచారం అందింది. సాహో సెట్స్‌కెళ్ల‌క‌ముందే సుజీత్ క్లూ ఇచ్చాడు. అందుకు త‌గ్గ‌ట్టే ట్రాన్స్‌ఫార్మార్స్ బేట్స్‌ని బ‌రిలో దించుతున్నామ‌ని చెప్ప‌గానే అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఆ ప్ర‌కార‌మే భారీ యాక్ష‌న్ సీన్స్ ప్ర‌స్తుతం యుఏఇలో తెర‌కెక్కిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్యంత ఖ‌రీదైన కార్ ఛేజ్ సీన్ ఇద‌ని చెబుతున్నారు. నేడు చిత్రీక‌ర‌ణ సాగుతున్న స్పాట్ నుంచి లీకైంది. ఈ కార్ ఛేజ్ యాక్ష‌న్ సీన్‌లో ప్ర‌భాస్ అండ్ టీమ్ రిగ‌ర‌స్‌గా పాల్గొన్నారు.

User Comments