లేడీ ఎంపీతో క్రేజీ హీరో స్నేహం

Last updated on November 13th, 2019 at 08:52 am

రాత్రికి రాత్రే క‌ల్ట్ క్లాసిక్ సినిమాతో పాపుల‌ర్ అయిన హీరో అత‌డు. త‌న క్రేజ్‌నే బ్రాండ్‌గా మార్చుకుని బ్రాండింగ్ రంగంలో వెలిగిపోతూ మిగ‌తా హీరోల‌కి రోల్ మోడ‌ల్‌గా నిలిచాడు. తాజాగా నిర్మాత‌గా కూడా మారిన ఆ క్రేజీ హీరో.. ఓ లేడీ ఎంపీ మ‌ధ్య ఫ్రెండ్షిప్ ప‌తాక స్థాయికి చేరిన‌ట్టు క‌నిపిస్తోంది. స‌ద‌రు లేడీ ఎంపీ గార్మెంట్స్ బిజినెస్ రంగంలోకి కొత్త‌గా ఎంట‌రైంది. ఆమెకు సంబంధించిన వ‌స్త్ర ప్ర‌పంచానికి క్రేజీ హీరోనే బ్రాండ్ అంబాసిడ‌ర్‌. అధికార పార్టీకి చెందిన లేడీ ఎంపీకి న‌గ‌రంలోని అమీర్‌పేట‌, కూక‌ట్ ప‌ల్లి, సికింద్రాబాద్‌, ఉప్ప‌ల్ … ఇలా జంట‌న‌గ‌రాల్లోని చాలా చోట్ల బ్రాంచ్‌లున్నాయి.

వాటిని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ… ఏ వేదిక దొరికినా ప్ర‌చారం చేసేస్తున్నాడు స‌ద‌రు క్రేజీ హీరో. ఉత్త‌ర తెలంగాణ‌లోని ప‌లు కీల‌క న‌గ‌రాల్లోనూ బ్రాంచీల‌ని రీసెంట్‌గానే ఓపెన్ చేశారు. ప‌బ్లిసిటీ భారీగానే ప్లాన్ చేశారు. ఎక్క‌డ చూసినా… ఏ టీవీ పెట్టినా మ‌హేష్ థ‌మ్స్ అప్ యాడ్ త‌ర‌హాలోనే కుమ్మేసేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్ వెన‌క కూడా క్రేజీ హీరో హ‌స్తం బాగానే వుంది. త‌న‌తో రెండు వ‌రుస హిట్‌లు అందించిన హీరోయిన్‌ని స‌ద‌రు హీరో ఈ షోరూమ్ యాడ్ కోసం బాగానే వాడేశారు. దీంతో లేడీ ఎంపీ, క్రేజీ హీరో మ‌ధ్య స్నేహం మ‌రింత పెరిగి భాగ‌స్వామ్య‌ బిజినెస్‌ల వ‌ర‌కు వెళ్లేలా వుంద‌ని చెప్పుకుంటున్నారు. ఇక స‌ద‌రు క్రేజీ హీరోకి ఆ లేడీ ఎంపీ స‌పోర్ట్.. అధికార పార్టీ నాయ‌కులు స‌పోర్ట్ ఇవ్వ‌డంతోనే ఇండ‌స్ట్రీలో బిగ్ బీలంతా అత‌డితో సినిమాలు తీస్తున్నార‌న్న ముచ్చ‌టా వేడెక్కిస్తోంది. వాళ్ల బిజినెస్ ల‌కు ఆ హీరో స‌పోర్ట్. అత‌డి హీరోయిజానికి వీళ్లు స‌పోర్ట్! అన్న‌ట్టుగా ఈ బాండింగ్ సాగుతోంది.