బ‌న్నీ-అర‌వింద్ మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్!

Last Updated on by

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గీతా ఆర్స్ట్ ను వ‌దిలి సొంతంగా ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బ‌న్నీ సినిమాల‌కు సంబంధించిన ప్ర‌తీ డిస్క‌ష‌న్స్ అక్క‌డే జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ ఉన్న‌ట్లుండి గీత ఆర్స్ట్ ను ఎందుకు వ‌దిలి స‌పరేట్ గా ఏర్పాటు చేసిన‌ట్లు అన్న దానిపై అప్ప‌ట్లో ప‌లు రూమ‌ర్లు వినిపించాయి. డాడ్ మాట బ‌న్ని విన‌డ‌నే ఓ రూమ‌ర్ ఇండ‌స్ర్టీలో చాలా కాలం నుంచి ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వాళ్లిద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త దెబ్బ‌తిన‌డానికి మ‌రో కార‌ణం కూడా వినిపిస్తోంది. ఇద్దిరి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్త‌డంతో బ‌న్నీహుటా హుటిన సొంత దుకాణం ఏర్పాటు చేసుకున్నాడ‌ని వెబ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

అందువ‌ల్లే బ‌న్నీ గ‌డిచిన రెండేళ్ల‌లో ఆ సంస్థ‌లో సినిమా చేయ‌లేద‌ని, ఇటీవ‌ల సుకుమార్ తోబ‌న్ని క‌మిట్ మెంట్ విష‌యం కూడా డాడ్ కి తెలియ‌ద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో చెవులుకొరుక్కుంటున్నారు. ఈ విష‌యంలో అర‌వింద్ కూడా బ‌న్నీ పై సీరియ‌స్ గానే ఉన్నార‌ని అంటున్నారు. ఓ ప్ర‌ముఖ ఆంగ్ల వైబ్ సైట్లో సైతం ఇదే న్యూస్ వైర‌ల్ అవ్వ‌డం తో అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. అభిమానుల్లో కూడా కొంచెం క్లారిటీ లోపించిన‌ట్లు వినిపిస్తోంది. మ‌రి వీట‌న్నింటికి పుల్ స్టాప్ ప‌డాలంటే? అస‌లోళ్లు లైన్ లోకి వ‌స్తే గానీ! క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్, త్రివిక్ర‌మ్ లతో సినిమాలు చేసే బిజీలో ఉన్నాడు. ముందుగా ఏ ద‌ర్శ‌కుడి సినిమా సెట్స్ కు తీసుకెళ్తాడు అన్న దానిపై సందిగ్ద‌త నెల‌కొంది.

User Comments