జీరో నుంచే క్రియేటివిటీ బాబూ!- ఉపేంద్ర‌

Last Updated on by

కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర విల‌క్ష‌ణత గురించి తెలిసిందే. ఆయ‌న న‌టించిన సినిమాల‌న్నీ వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో అల‌రించాయి. ఆయ‌న‌ హీరోగా నటించిన తాజా సినిమా ఐ లవ్‌ యు. నన్నే… ప్రేమించు అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీతో దర్శకుడిగా పరిచయమైన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాకు నిర్మించారు. హైదరాబాద్‌లో తెలుగు టీజర్‌ విడుదల చేశారు. ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్‌, చంద్రు, వైవియ‌స్ చౌద‌రి, సుధాక‌ర్ కోమాకుల, సంజ‌న‌, లాయ‌ర్ బాలాజీ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఉపేంద్ర మాట్లాడుతూ – ప‌రిశ్ర‌మ‌ పెద్దది ఎప్పుడు అవుతుందంటే… పెద్ద మనుషులు ఉంటేనే! ఈ రోజు పెద్ద నిర్మాతలు, దర్శకుడు, రచయితలు మా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది. నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని స్ఫూర్తి పొందుతున్నా. తెలుగులో చాలా బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేశారు. మీనుంచి నేను చాలా నేర్చుకోవాలి. స్ఫూర్తిగా తీసుకుంటున్నా. ఇప్పటికీ ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు. నా సీక్రెట్‌ ఒక్కటే… నేను ప్రతిదీ జీరో నుంచి మొదలుపెట్టా. చాలామంది అలాగే ప్రారంభించి ఉంటారు. అందుకే, పెద్దవాళ్ళు అయ్యారు. మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్‌ అవుతుంది. పెద్ద హీరోతో నా కెరీర్‌ స్టార్ట్‌ చేసి ఉంటే.. హీరో గురించి సినిమాకు ప్రేక్షకులు వస్తారని తక్కువ ఎఫ్టర్ట్స్‌ పెట్టేవాణ్ణి ఏమో! తెలియదు. చిన్న బడ్జెట్‌, కొత్తవాళ్ళతో చేసేటప్పుడు టైటిల్‌, పోస్టర్‌ డిజైన్‌ కూడా ఇంపార్టెంటే. థియేటర్‌ నుంచి బయటకు వెళ్ళాక నా సినిమా గురించి మాట్లాడాలంటే ప్రతి సన్నివేశం, మలుపు బావుండాలని ఆలోచించడానికి జీరోనే కారణం అయ్యింది. తర్వాత ఇప్పుడు జీరో నుంచి పొలిటికల్‌ పార్టీ ప్రారంభించాను. ఎందుకంటే… రాజకీయాల్లో డబ్బులే సమస్య. రాజకీయాలు వ్యాపారంగా మారాక‌ 20 శాతం మంది 80 శాతం మంది అమాయ‌క జ‌నాల్ని పాలిస్తున్నారు. అది మారాలని పార్టీ పెట్టాను. ఈ సినిమా గురించి చంద్రు చాలా చెప్పారు. సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. సినిమా క్రెడిట్‌ అంతా ఆయనకే చెందుతుంది అన్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ కి కృత‌జ్ఞ‌త‌లు.. ఇది ద్వితీయ ప్ర‌య‌త్న‌మ‌ని చంద్రు అన్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ -నేను 1998లో పెళ్లి పందిరి, పవన్‌కల్యాణ్‌ తొలిప్రేమ’ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ అవుతున్న టైమ్‌. అప్పుడు ఉపేంద్ర సినిమాల ను తొలిప్రేమతో పోల్చి చూస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ఇదేంటి? ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?’ అనుకునేవాణ్ణి. తర్వాత నేను ఆర్య స్క్రిప్టు చూసినప్పుడు… ఉపేంద్ర సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేయాలి? అని చూశాను. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది. ఐ లవ్‌ యు సినిమా దర్శకుడు, నిర్మాత చంద్రు రెండు రోజులుగా నేను ఈ ఫంక్షన్‌కి రావాలని అభ్య‌ర్థించారు. ఉపేంద్ర కోసం వచ్చాను. ఈ సినిమా తెలుగులో, కన్నడలో సక్సెస్ అవ్వాలి అన్నారు.

User Comments