పాపం: శ్రీదేవి కోరిక నెరవేరకుండానే..

Last Updated on by

శ్రీ‌దేవి చ‌నిపోయి వారం రోజులు కావొస్తున్నా ఇప్ప‌టికీ ఆమెను మ‌రిచిపోలేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. 50 ఏళ్ల అనుబంధం క‌దా అంత ఈజీగా మ‌రిచి పోవ‌డం సాధ్యం కాదు. ఇక ఈమె మ‌ర‌ణించిన దానికంటే కూడా ఇప్పుడు మ‌రో విష‌యంపై అభిమానులు బాధ ప‌డుతున్నారు. అదే త‌న కూతురు తొలి సినిమా చూడ‌లేక‌పోవ‌డం. అవును.. ఝాన్వీని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌డం కోసం శ్రీ‌దేవి చాలా క‌ష్ట‌ప‌డింది. మూడేళ్లుగా చాలా మంది ద‌ర్శ కుల‌తో పాటు ర‌చ‌యిత‌లు క‌థ‌లు చెప్పినా తాను మాత్రం కంగారు ప‌డ‌కుండా స‌రైన క‌థ కోసం చూసింది. అన్నీ చూసుకుని ధ‌డ‌క్ సినిమా క‌న్ఫ‌ర్మ్ చేసింది. సైరాత్ సినిమాకు రీమేక్ ఇది. అయినా ప‌ర్లేదని కూతుర్ని తీసుకెళ్లి క‌ర‌ణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. ఈ చిత్రం జూన్ లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా స‌గానికి పైగా పూర్త‌యింది.

ఎన్నో ఆశల‌తో కూతుర్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తోన్న శ్రీ‌దేవి.. పాపం ఆ ముచ్చ‌ట తీర‌కుండా వెళ్లిపోయింది. అచ్చంగా ఇదే బాధ బోనీక‌పూర్ మొద‌టి భార్య మోనా కపూర్ కు కూడా క‌లిగింది. ఈమె 2012లో చ‌నిపోయింది. అప్ప‌టికే చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ ప‌డుతుంది. అదే టైమ్ లో అర్జున్ క‌పూర్ త‌ల్లి కోసం క‌ష్ట‌ప‌డి వెయిట్ త‌గ్గి హీరో అయ్యాడు. ఈయ‌న తొలి చిత్రం ఇష‌క్ జాదే 2012 మే లో విడుద‌లైంది. కానీ మోనా కపూర్ మాత్రం మార్చ్ 25న క‌న్నుమూసింది. అంటే కొడుకు సినిమా కంటే రెండు నెల‌ల ముందే మ‌ర‌ణించింది మోనా. ఇప్పుడు శ్రీ‌దేవి కూడా అంతే. మొత్తానికి బోనీక‌పూర్ ఇద్ద‌రు భార్య‌లు.. అటు కొడుకు.. ఇటు కూతురు తొలి సినిమాను చూసుకోక‌ముందే క‌న్నుమూయ‌డం బాధాక‌రం.

User Comments