వ్వావ్‌! క్యూట్ సితార పాడితే..

Last Updated on by

రీల్ సీఎం భ‌ర‌త్‌గా గ్రాండ్ విక్ట‌రీ అందుకుని ఎంతో ఉల్లాసంగా ఉన్నారు డాడ్ మ‌హేష్‌. ఆయ‌న విజ‌యం వెన‌క మామ్ న‌మ్ర‌త కృషిని జ‌నం తెగ పొగిడేస్తున్నారు. `భ‌ర‌త్ అనే నేను` విజ‌యంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్న మ‌హేష్ అర్థ‌నారీశ్వ‌రుడై భార్య న‌మ్ర‌త‌కు అదిరిపోయే లిప్‌లాక్ వేశారు. ఆ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌మ్మీ – డాడీకి మాత్ర‌మేనా? ఆ ఆనందం.. నాకు లేదా! అని భావించిందేమో.. ఇదిగో క్యూట్ సితార కూడా త‌న ఆనందాన్ని ఇలా వ్య‌క్తం చేసింది.

డాడ్ మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` సినిమాలోంచి ఓ పాట‌ను ఎంపిక చేసుకుని త‌న‌దైన శైలిలో గానాలాప‌న చేసింది. కోయిల‌మ్మ కుహూగానంలా క్యూట్ సితార పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సితార పాడిన విజువ‌ల్స్‌ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ స్వ‌యంగా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేశారు. `అరెరే ఇది క‌ల‌లా ఉన్న‌దే.. అయ్య‌య్యో ఇది జ‌రిగిన నిజ‌మిదే..“ అంటూ సితార గానాలాప‌న ఫెంటాస్టిక్. డాడ్‌లోని ఎన‌ర్జీ, మామ్‌లోని ఎక్స్‌ప్రెష‌న్ క‌ల‌గ‌లిపి సితార కొత్త హావ‌భావాల్ని ప్ర‌ద‌ర్శించింది. సో క్యూట్ సితార.. స్ట‌న్నింగ్ సింగింగ్ ట్యాలెంట్ అని పొగిడేస్తున్నారంతా. సితార గానాలాప‌న‌ చూడాల‌నుకుంటే….

Listen here:

❤️❤️❤️♥️♥️♥️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

User Comments