దాస‌రి ఆత్మీయుడు మృతి

Last Updated on by

టాలీవుడ్‌లో మ‌రో మ‌ర‌ణ వార్త‌. ప్ర‌ముఖ నిర్మాత కోటపల్లి రాఘవ (105) ఆక‌స్మిక‌ మృతిచెందారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మంగళవారం గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని తెలుస్తోంది. 1913 డిసెంబర్ 9న తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి గ్రామంలో జన్మించిన రాఘ‌వ .. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి, అందులో 30కి పైగా సినిమాలు నిర్మించారు. తరంగణి, తూర్పు పడమర వంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన‌ చిత్రాల్ని ఆయ‌న నిర్మించారు. తాతామనవడు(1972), సంసారం సాగరం (1973) వంటి క్లాసిక్ సినిమాల‌తో ఉత్తమ నిర్మాతగా నంది పుర‌స్కారాలు అందుకున్నారు. దాస‌రి, రావుగోపాల్‌రావు, కోడి రామ‌కృష్ణ‌, గొల్ల‌పూడి మారుతీరావు, ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం వంటి లెజెండ్స్‌ని తెలుగు సినిమా తెర‌కు ప‌రిచ‌యం చేసిన మేటి నిర్మాతగా ఆయ‌న ధ‌న్యుడు. మ‌ద్రాసు ప‌రిశ్ర‌మ పుట్ట‌క‌ముందే కోల్‌క‌త‌లో ట్రాలీ పుల్ల‌ర్‌గా ప‌ని చేసిన ఆయ‌న సినీనిర్మాత‌గా ఎద‌గ‌డం ఎంతో స్ఫూర్తిదాయ‌కం. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

User Comments