ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి ఇల్లు అమ్మ‌కానికి?

Last Updated on by

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఇల్లు అమ్మ‌కానికి పెడుతున్నారా? బినామీల మోసం ఆయ‌న కుటుంబానికి పెను శాపంగా మారిందా? అంటే .. అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. డా.దాస‌రి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న ఇంట్లో ఏదో జ‌రుగుతోంది? అదేంటి.. అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. ఓవైపు కుటుంబంలో చిన్న‌పాటి క‌ల‌త‌లు ఇదివ‌ర‌కూ ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. దాంతో పాటే ఆస్తి వివాదాల‌కు సంబంధించి ఫిలింన‌గ‌ర్ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం దాస‌రి కుటుంబీకుల‌పై బినామీలు తిరుగుబాటు చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దాస‌రి స్వ‌ర్గ‌స్తుల‌య్యాక‌.. ఆయ‌న బినామీలు కొంద‌రు కుటుంబీకుల‌కు ఎదురెళ్లి పోలీస్ కేసులు, కోర్టు కేసులు అంటూ హడావుడి చేస్తున్నార‌న్న స‌మాచారం తాజాగా ఫిలింన‌గ‌ర్ లో వేడెక్కిస్తోంది. దాస‌రి నారాయ‌ణ‌రావు కేంద్ర బొగ్గు శాఖ‌ మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న స్కామ్ కి పాల్ప‌డ్డారంటూ అప్ప‌ట్లో వివాదం వేడెక్కించింది. ఆయ‌న ఆస్తుల‌పై ఐటీ ఆరాలు వగైరా హ‌డావుడి జ‌రిగే అవకాశం ఉంద‌ని వార్త‌లు ప్ర‌ముఖంగా వినిపించాయి. ఆ త‌ర్వాత సీబీఐ ద‌ర్యాప్తు లోనూ బొగ్గు కుంభ‌కోణంలో దాస‌రి హ‌స్తం ఉంద‌ని నిర్ధారించింది. జిందాల్ కంపెనీ నుంచి క్విడ్ ప్రో కో రూపంలో దాస‌రి కి తాయిలం ముట్టింద‌ని సీబీఐ ద‌ర్యాప్తు నిగ్గు తేల్చింది. జిందాల్ కంపెనీ దాదాపు 2.25కోట్ల మేర దాస‌రి కి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టింద‌ని సీబీఐ విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసి దాస‌రి ఆస్తుల్ని ఎటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధ‌మైంద‌ని అప్ప‌ట్లో ప్ర‌ముఖ మీడియాల్లో ప్ర‌చార‌మైంది. అదంతా అటుంచితే దాస‌రి మ‌ర‌ణానంత‌రం ఆ ఇంట్లో ఆస్తి త‌గాదాలు ర‌చ్చ‌కెక్కాయి. ఒక కోడ‌లు అత్తింటి ఆర‌ళ్లు అంటూ మీడియాకెక్క‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ లోని దాస‌రి ఇల్లు అమ్మ‌కానికి పెట్టారంటూ మ‌రో ప్ర‌చారం ఊపందుకుంది. బొగ్గు స్కాంపై విచార‌ణ సంద‌ర్భంలో ఈడీ ఆస్తుల్ని ఎటాచ్ చేసే అవ‌కాశం ఉన్నందున దాస‌రి త‌న వ‌ద్ద ఉన్న కొంత క్యాష్ ని, బంగారాన్ని త‌న శిష్యుల్లో కొంద‌రు బినామీల వ‌ద్ద దాచార‌ట‌. అలా దాచిన మొత్తాల్ని స‌ద‌రు బినామీలు దోచేశార‌ని, తిరిగి కుటుంబీకులు అడిగితే ఇచ్చేందుకు నిరాక‌రించార‌ని.. దీంతో వివాదాలు ర‌చ్చ‌కెక్కాయ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ బినామీలే తిరిగి దాస‌రి కుటుంబీకుల‌పై రివ‌ర్స్ కేసులు అంటూ ర‌చ్చ చేస్తున్నార‌ట‌. పెద్దాయ‌న మ‌ర‌ణంతో ఇవ‌న్నీ ర‌చ్చ‌వుతుండ‌డంపైనా ఆస‌క్తి క‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ గొడ‌వ‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు కీ.శే.డా. దాస‌రి నారాయ‌ణ‌రావు ఎంతో సెంటిమెంటుగా భావించే జూబ్లీహిల్స్ ఇంటిని అమ్మేయాల‌నుకుంటున్నారంటూ మ‌రో ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ఆయ‌న ఉన్న‌న్నాళ్లు ఆ ఇల్లు ఒక దేవాల‌యంలా ఉండేది.. ఇప్పుడు అలాంటి ఇంటిని అమ్మ‌కానికి పెడుతున్నారా? అంటూ అభిమానుల్లో ముచ్చ‌టా సాగుతోంది. అస‌లింత‌కీ ఈ వివాదాల‌కు కార‌ణ‌మేంటి? పెద్దాయ‌న వెళ్లాక‌.. బినామీలు ఎంత కొట్టేశారు.. ఏమేమి దోచేశారు? అన్న‌ది త‌ర్వాతి ఆర్టిక‌ల్ లో.. !! కీప్ వాచింగ్ దిస్ స్పేస్…!

User Comments