4.30 పీఎం దాస‌రి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Last Updated on by

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు తొలి జ‌యంతిని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా శిష్య‌బృందం, ప‌రిశ్ర‌మ పెద్ద‌లంతా క‌లిసి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. నేటి సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఫిలింన‌గ‌ర్ సొసైటీ కాంప్లెక్స్(ఫిలింఛాంబ‌ర్‌) ప‌రిస‌రాల్లో దాస‌రి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్నారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల దంప‌తులు, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స‌మ‌క్షంలో ఈ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.
ఈ ఆవిష్క‌ర‌ణ‌కు ప‌రిశ్ర‌మ యావ‌త్తూ త‌ర‌లిరానుంద‌ని తెలుస్తోంది. దాస‌రి అందరివాడు. పైగా కార్మికుల దేవుడు.. కాబ‌ట్టి అన్ని కార్మిక సంఘాల నుంచి అసోసియేష‌న్ అధ్య‌క్షులు ఈ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొంటార‌ని తెలిసింది. ఇక ఈ వేడుక‌లో చిత్ర‌పురి కాల‌నీ అధ్య‌క్షుడు, ఫెడ‌రేష‌న్ కీల‌క‌పాత్ర‌ధారి అయిన కొమ‌ర వెంక‌టేష్ పాల్గొన‌నున్నారు. ఇక దాస‌రిపై బ‌యోపిక్ తెర‌కెక్కించి స్వ‌ర్గంలో ఉన్న ఆయ‌న‌కు కానుక‌నివ్వాల‌ని నిర్మాత సి.క‌ళ్యాణ్ త‌హ‌త‌హ‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు దాస‌రి స‌న్నిహిత శిష్యులు రేలంగి న‌ర‌సింహారావు, జ‌ర్న‌లిస్టు ప్ర‌భు వంటి వారు విగ్ర‌హావిష్క‌ర‌ణ ప‌నులు అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌.

User Comments