దాస‌రి త‌ర్వాత పుట్టాడండోయ్‌!

Last Updated on by

అమెరికా సాక్షిగా టాలీవుడ్ ప‌రువు గంగ‌లో క‌లిసిపోయింది. శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారంతో ఇప్పుడిప్పుడే కోలుకోలేని స‌న్నివేశం నెల‌కొంది అనుకుంటుండ‌గానే, మ‌రో డ‌ర్టీ గేమ్ బ‌య‌ట‌ప‌డింది. ఈసారి ఈ గేమ్‌లో ఏకంగా క‌థానాయిక‌ల సెక్స్ రాకెట్ గుట్టు ఒక‌టి అమెరికా పోలీసుల‌కు చిక్క‌డంతో ఎవ‌రి పేర్లు బ‌య‌ట‌ప‌డ‌తాయోనంటూ ఒక‌టే బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఈ స‌న్నివేశంపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లాంటి ద‌ర్శ‌క‌నిర్మాత ఓ రేంజులో విరుచుకుప‌డుతున్నారు. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు.

అన్ని ప‌రిశ్ర‌మ‌లో ఇది ఉన్నా సినిమా వాళ్ల‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ త‌మ్మారెడ్డి త‌న‌దైన శైలిలో దంచేశారు. అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వ‌హిస్తున్న కిష‌న్ అనే అత‌డు ఓ విటుడు. అత‌డు సినిమా వాడే కావొచ్చు. ఏవో రెండు సినిమాలు తీశాడు గ‌తంలో. అంత‌మాత్రాన సినిమా వాళ్లు అంటూ ఎందుకిలా చావ‌గొడుతున్నారు. ప‌రిశ్ర‌మ‌పైనే నింద వేస్తున్నారు.. అంటూ త‌న‌దైన శైలిలో వ‌కాల్తా పుచ్చుకున్నారు. ఇక ఆయ‌న వాగ్ధాటితో దాస‌రి త‌ర‌వాత వేరొక ఆప్ష‌న్ మన‌కు దొరికాడ‌న్న ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లు అడిగేవాడే లేక‌పోతే ప‌రిశ్ర‌మ‌ను ఏమైనా అంటారు. టాలీవుడ్ ప్ర‌స్తుతం సంధికాలంలో ఉంది. ఎవ‌రికి వారు ప‌రిశ్ర‌మ‌ను ఆడుకుంటున్నారు. ఇలాంట‌ప్పుడు ప్ర‌తిఘ‌టించే శ‌క్తిగా త‌మ్మారెడ్డి నిలుస్తార‌నే ఆశిద్దాం. ఇక ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌కి వ్య‌తిరేకంగా మెగా ఫ్యామిలీ హీరోలు నిన‌దిస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments