తొలిరోజు సీఎం సార్‌ వ‌సూళ్లు?

Last Updated on by

భ‌ర‌త్ అనే నేనుతో బాక్సాఫీస్ ను దున్నేస్తున్నాడు మ‌హేష్ బాబు. ఈయ‌న రాక‌తో మ‌ళ్లీ రికార్డుల మోత మొద‌లైపోయింది. చాలా ఏరియాల్లో కొత్త రికార్డుల‌కు నాందీ ప‌లికాడు భ‌ర‌త్. ముఖ్యంగా త‌న‌కు ఆయువు ప‌ట్టుగా ఉన్న ఓవ‌ర్సీస్ లో మ‌రోసారి స‌త్తా చూపించాడు సూప‌ర్ స్టార్. అయితే అజ్ఞాత‌వాసి పేరు మీదున్న 1.6 మిలియ‌న్ రికార్డ్ మాత్రం భ‌ర‌త్ ట‌చ్ చేయ‌లేక‌పోయాడు. ఈ చిత్రం అక్క‌డ ప్రీమియ‌ర్స్ తో క‌లిపి తొలిరోజు 1.4 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూలు చేసిన‌ట్లుగా తెలుస్తుంది. ఇదే జ‌రిగితే ఖైదీ నెం.150 రికార్డులైతే క్రాస్ చేసినా ప‌వ‌న్ అలాగే ఉన్నాడు. ఇక ఇండియాలో కూడా భ‌ర‌త్ దూకుడు బాగానే సాగింది. ఆల్ టైమ్ రికార్డుల జోలికి వెళ్ళ‌క‌పోయినా.. 20 కోట్ల షేర్ అయితే తీసుకొచ్చాడు మ‌హేష్ బాబు.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ కెరీర్ లో స్పైడ‌ర్ 16 కోట్ల‌తో హైయ్య‌స్ట్ డే వ‌న్ రికార్డ్ గా ఉంది. ఇప్పుడు భ‌ర‌త్ దాన్ని తుడిచేసాడు. ఈ చిత్రం తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 30 కోట్ల షేర్ రాబ‌ట్టిన‌ట్లుగా తెలుస్తుంది. నైజాంలో అయితే 4.47 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇది ఎక్కువే కానీ రికార్డ్ అయితే కాదు. ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి తొలిరోజే నైజాం 5.40 కోట్లు వ‌సూలు చేసింది. కానీ దానికంటే దాదాపు కోటి త‌క్కువ వ‌సూలు చేసింది భ‌ర‌త్. అయితే టాక్ బాగుంది కాబ‌ట్టి రాబోయే రోజుల్లో దున్నేస్తున్నాడంలో ఎలాంటి సందేహం లేదు. కొర‌టాల-మ‌హేష్ కాంబినేష‌న్ మ‌రోసారి మ్యాజిక్ చేస్తున్నారు. అయితే తొలి రోజు నుంచే రికార్డుల వేట మాత్రం మొద‌లు పెట్ట‌లేదు. సినిమా స్లోగా ఉంద‌నే టాక్ ఉండ‌టంతో నెమ్మ‌దిగా జ‌నాల్లోకి వెళ్తుంది భ‌ర‌త్ అనే నేను. మ‌రి ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అక్ష‌రాలా 100 కోట్ల షేర్ సాధించాలి.

User Comments