హీరోగారి తోట‌లో అనుమానాస్ప‌ద మృతి

టాలీవుడ్ స్టార్ హీరో ఫామ్ హౌస్(తోట‌)లో అనుమానాస్ప‌ద మృతి సంచ‌ల‌న‌మైంది. దాదాపు 40 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న స‌ద‌రు హీరోగారి వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఇలా ఓ మృత‌దేహం ల‌భ్యం కావ‌డంతో ఆ వార్త కాస్తా దావాన‌లంలా వ్యాపిస్తోంది. అస‌లింత‌కీ ఏం జ‌రిగింది?  ఘ‌ట‌న పూర్వాప‌రాల్లోకి వెళితే..
స్టార్ హీరో కింగ్ నాగార్జున షాద్‌న‌గ‌ర్ స‌మీపంలోని పాపిరెడ్డి గూడ‌లో 40 ఎక‌రాల విస్థీర్ణంలో ఓ వ్య‌వ‌సాయ క్షేత్రం ని కొనుక్కున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. ఆ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ప‌నుల నిమిత్తం కొంద‌రు వ్య‌వ‌సాయ నిపుణుల్ని పంపించిన‌ప్పుడు ఈ మృతికి సంబంధించిన సంగ‌తి వెలుగు చూసింద‌ట‌.  ఇందులో ఏడాది పాటు కుళ్లిన స్థితిలో ఉన్న ఈ మృత‌దేహం ఎవ‌రిది? ఇది హ‌త్య‌నా లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా? అన్న‌ది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక క‌నుగొన్న మృత‌దేహాన్ని ఇదే ఫామ్ హౌస్ లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. పోలీసుల ద‌ర్యాప్తులో పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.