`మ‌హ‌ర్షి`కి అలా ఒప్పందం కుదిరిందా?

Last Updated on by

సినిమాల‌కి డిజిట‌ల్ మార్కెట్ ఓ పెద్ద వ‌రంలా మారింది. ఒక‌ప్పుడు థియేట్రిక‌ల్‌, శాటిలైట్ రైట్స్ రూపంలో మాత్ర‌మే నిర్మాత‌ల‌కి డ‌బ్బులొచ్చేవి. ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలోనూ కాసుల వ‌ర్షం కురుస్తోంది. అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు క‌నీవినీ ఎగుర‌నంత ధ‌ర ప‌లుకుతున్నాయి. స‌గం పెట్టుబ‌డి డిజిట‌ల్ రైట్స్ రూపంలోనే వ‌స్తున్న ప‌రిస్థితి కూడా కొన్ని క్రేజీ సినిమాల విష‌యంలో క‌నిపిస్తోంది. అయితే విడుద‌లైన నెల రోజుల్లోపే డిజిట‌ల్ మాధ్య‌మాల్లో సినిమాలు ప్ర‌ద‌ర్శితం అవుతుండ‌డంతో నిర్మాత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రీ అంత త్వ‌రగా సినిమాని విడుద‌ల చేస్తే, థియేట‌ర్ల‌కి వెళ్లి సినిమాని చూడాల‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుడిలో స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. మ‌హేష్‌బాబు `మ‌హ‌ర్షి` డిజిట‌ల్ రైట్స్ ఒప్పందం మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

అమెజాన్ ప్రైమ్ సంస్థ `మ‌హ‌ర్షి` హ‌క్కుల్ని కొనుక్కుంది. అయితే మొద‌ట ఈ సినిమా కూడా విడుద‌లైన నెల రోజుల్లోపే డిజిట‌ల్ మీడియాలో చూసే వెసులుబాటు ఉంటుంద‌ని అనుకొన్నారంతా. కానీ నిర్మాత‌లు యాభై రోజుల త‌ర్వాతే సినిమాని డిజిట‌ల్ మీడియాలో ఉంచాల‌ని అమెజాన్ ప్రైమ్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు తెలిసింది. అంటే మ‌హేష్ `మ‌హ‌ర్షి`ని ఇంట‌ర్నెట్‌లో చూడాల‌నుకొన్న‌వాళ్లు ఇంకొంచెం ఎక్కువ రోజులు ఎదురు చూడాల‌న్న‌మాట‌.

User Comments