డియ‌ర్ కామ్రేడ్ ప్రీబిజ‌నెస్ లెక్క‌లివే

dear comrade inside reports

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వం వ‌హించిన `డియ‌ర్ కామ్రేడ్‌` ఈ శుక్ర‌వారం ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ‌వుతోంది. మైత్రీ మూవీ మేకర్స్- బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దాదాపు 34.60 కోట్ల మేర‌ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల హ‌క్కుల రూపంలో 22 కోట్లు రిక‌వ‌రీ అయ్యింది. ఓవ‌ర్సీస్ నుంచి మ‌రో 11 కోట్ల బిజినెస్ సాగింది. ఇత‌ర‌త్రా బిజినెస్ ఆస‌క్తిక‌ర‌మే. ఈ సినిమాకి మైత్రి సంస్థ భారీగానే బ‌డ్జెట్ పెట్టింద‌న్న ముచ్చ‌టా ట్రేడ్ లో వినిపిస్తోంది. అయితే గీత‌-గోవిందు కాంబినేష‌న్ పై ఉన్న క్రేజు వ‌సూళ్లుగా మార‌తాయ‌న్న‌దే బిగ్ హోప్.

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ప‌రిశీలిస్తే.. నైజామ్- 9.00 కోట్లు, సీడెడ్- 3.60 కోట్లు, ఉత్తరాంధ్ర- 2.40 కోట్లు, కృష్ణ- 1.60 కోట్లు, గుంటూరు- 1.80 కోట్లు, ఈస్ట్ -1.50 కోట్లు, వెస్ట్: 1.30 కోట్లు, నెల్లూరు- 0.75 కోట్లకు బిజినెస్ సాగింది. ఎపీ- తెలంగాణా ఓవ‌రాల్ బిజినెస్- రూ. 21.75 కోట్లు చేసింద‌ట‌. కర్ణాటక-4.00 కోట్లు, కేర‌ళ‌- 60ల‌క్ష‌లు, తమిళనాడు-2.45 కోట్లు, ఇత‌ర భార‌త‌ద‌శం- 1.00 కోట్లు, ఓవర్సీస్- 3.55 కోట్లు ప‌లికింద‌ని తెలుస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా -35 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈ బిజినెస్ కి నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ అద‌నం. డిజిట‌ల్ రైట్స్- డ‌బ్బింగ్ రైట్స్- ఆడియో రైట్స్ వ‌గైరా వివ‌రాలు వెల్ల‌డికావాల్సి ఉంది.

అన్ని మెట్రో న‌గ‌రాల్లో మ‌ల్టీప్లెక్సుల నుంచి ఆన్ లైన్ బుకింగ్స్ స్పీడ్ క‌నిపిస్తోంది. తొలి వీకెండ్ లో ఈ సినిమాకి భారీ రిక‌వ‌రీ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అర్జున్ రెడ్డి-గీత‌గోవిందం-టాక్సీవాలా చిత్రాల స‌క్సెస్ తో దేవ‌ర‌కొండ దూకుడు బాక్సాఫీస్ కి క‌లిసి రానుంది. డే1 ఓపెనింగ్స్ స‌హా రిజ‌ల్ట్ సంగ‌తి తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.