డియ‌ర్ కామ్రేడ్ ఫిలింన‌గ‌ర్ టాక్

dear comrade inside reports

విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న జోడీ న‌టించిన `గీత గోవిందం` బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్లు వ‌సూలు చేసింది. అలాంటి క్రేజీ పెయిర్ మ‌రోసారి రిపీట‌వుతోంది అంటే అభిమానుల్లో ఆస‌క్తి ప‌దింత‌లు ఉంటుంది. అగ్ర హీరోల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాప్ బ్యానర్ గా ఎదిగిన మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌డం అంచ‌నాల్ని పెంచింది. భ‌ర‌త్ క‌మ్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫికెట్ ని ఇచ్చింది. అయితే ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం..

అస‌లు డియ‌ర్ కామ్రేడ్ ఎలా ఉంది? అంటే.. ఫ‌స్టాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ సెకండాఫ్ మాత్రం నెమ్మ‌దిగా సాగుతుంద‌ట‌. సుదీర్ఘ‌మైన ర‌న్ టైమ్ ఉన్న ఈ సినిమాని చివ‌రి వ‌ర‌కూ బోర్ ఫీల‌వ్వ‌కుండా చూడాలంటే ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్ష త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. అయితే డియ‌ర్ కామ్రేడ్ చిత్రానికి హైద‌రాబాద్ – చెన్న‌య్ – బెంగ‌ళూరు స‌హా ప‌లు న‌గరాల్లో అద్భుత‌మైన ప్ర‌చారం చేశారు. దీంతో మ‌ల్టీప్లెక్సుల్లో ఓపెనింగులు అదిరిపోయే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ లోనూ దేవ‌ర‌కొండ క్రేజు ఓపెనింగుల‌కు క‌లిసి రానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి వీకెండ్ వ‌సూళ్ల‌కు డోఖా ఉండ‌దు. కానీ లాంగ్ ర‌న్ లో ఏ స్థాయి రిజ‌ల్ట్ ని అందుకోనుంది? అన్న‌ది చూడాలి. ఈనెల 26న డియ‌ర్ కామ్రేడ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం లో రిలీజ్ చేస్తున్నారు. 25 జూలై 9 పీఎం నుంచే ప్రివ్యూల సంద‌డి నెల‌కొన‌నుంద‌ని తెలుస్తోంది.