నాలుగు భాష‌ల్లో కామ్రేడ్ రొమాన్స్

Last Updated on by

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న జంట‌గా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న `డియ‌ర్ కామ్రెడ్` షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. నిర్మాణానంత‌ర ప‌నులు కూడా శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి.`గీత‌గోవిందం`తో హిట్ ఫెయిర్ గా క్రేజ్ ద‌క్కించుకోవ‌డంతో సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. `గీతా గోవిందం`లో ఇద్ద‌రి మ‌ధ్య పూర్తిస్థాయి రొమాన్స్ లేక‌పోయినా! కామ్రెడ్ ఇప్పుడా లోటును భ‌ర్తీ చేసేలా ఉన్నాడ‌ని తెలుస్తోంది. భ‌ర‌త్ క‌మ్మ ఓ ఫ్రెష్ కంటెంట్ తో ల‌వ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటే ఘాడ‌మైన ప్రేమికురాలి పాత్ర‌లో ర‌ష్మిక న‌టిస్తున్న్లట్లు తెలుస్తోంది. తాజాగా చిత్రాన్ని తెలుగుతో పాటు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు స‌మాచారం.

`కిరాక్ పార్టీ`తో క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక కు అక్క‌డ మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలివిగా క్యాష్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు విజ‌య్ సుప‌రిచితుడే. `నోటా` సినిమాతో న‌టుడిగా పాస్ అయ్యాడు. ఇక‌ ర‌ష్మిక కూడా త‌మిళ్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే ఓ సినిమాకు సంత‌కం చేసింది. ఈ నేప‌థ్యంలో డియ‌ర్ కామ్రెడ్ మంచి టాక్ తెచ్చుకుంటే ఇద్ద‌రి కెరీర్ కు ప్ల‌స్ అవుతుంది. నిఖిల్, నాగ‌చైత‌న్య‌, నాని నుంచి రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకేసారి ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లో ఒకేసారి విడుద‌లైంది లేదు.