పిక్ టాక్‌: దీపిక డెనిమ్ లుక్

Last Updated on by

బాలీవుడ్ లో ప్యాష‌న్ ఐక‌న్ ల‌కు కొద‌వేం లేదు. అయితే ఏ ఇత‌ర నాయిక‌తో పోల్చినా పొడుగు కాళ్ల సుంద‌రి దీపిక ప‌దుకొనే ఎంతో స్పెష‌ల్. ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో అభిమానుల్ని అల‌రిస్తూనే ఉంది. ప్ర‌క్యాత మ్యాగ్జిమ్ క‌వ‌ర్‌పేజీపై నిరంత‌రం క‌నిపిస్తూనే ఉంటుంది. ఇటీవ‌లే మ్యాగ్జిమ్ ఫోటోషూట్ తో ఆక‌ట్టుకుంది. ప్ర‌ఖ్యాత వావ్, బ్రైడ‌ల్ మ్యాగ‌జైన్ల క‌వ‌ర్ పేజీపైనా ఫ్యాష‌న్ స్టేట్‌మెంట్ కుర్ర‌కారులోకి దూసుకుపోయింది.
తాజాగా ఓ కొత్త  లుక్ తో దీపిక హాట్ టాపిక్ గా మారింది. దీపిక పూర్తిగా డెనిమ్ లుక్ లో ద‌ర్శ‌న‌మి్చింది. వైటిష్ షేడ్ ఉన్న‌ డిజైనర్ డెనిమ్ లో దీపిక న‌వ్వులు చిందిస్తూ ఆక‌ట్టుకుంది. ఇక ర‌ణ‌వీర్‌ని దీపిక పెళ్లాడాక సింబా రూపంలో వంద కోట్ల క్ల‌బ్ సినిమా ద‌క్కింది. ఇదే హుషారులో అత‌డు మ‌రిన్ని చిత్రాల్లో న‌టించేస్తున్నాడు. మ‌రి దీపిక తిరిగి ముఖానికి రంగేసుకునేదెప్పుడో?  ప్ర‌స్తుతానికి హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

User Comments