ప‌ద్మావ‌తిని ఇలా చూస్తే గ‌గుర్పాటే!

Last Updated on by

Last updated on March 26th, 2019 at 03:06 pm

రాజ్ పుత్ మ‌హారాణి ప‌ద్మావ‌తిగా దీపిక అంద‌చందాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు స‌లాం గులాం అంటూ కీర్తించారు. గొప్ప ధీర‌త్వం క‌లిగిన మ‌హారాణిగా దీపిక న‌ట‌న‌కు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వికృత‌మైన రూపంతో దీపిక క‌నిపిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. యాసిడ్ దాడికి గురైన ఓ సాధార‌ణ యువ‌తిగా దీపిక అభిన‌యించ‌బోతోంది. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ అనే యాసిడ్ ఎటాక్ స‌ర్వైవ‌ర్ కం యాక్టివిస్ట్  పాత్ర‌లో దీపిక న‌టించ‌నున్నారు. తాజాగా దీపిక ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.
ఫిలింఫేర్ గ్ర‌హీత `రాజీ` ఫేం మేఘ‌న గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంగా ఇప్ప‌టికే ఈ సినిమా పాపుల‌రైంది. ఇక ఈ చిత్రంలో మ‌ల్టీ అనేది దీపిక పాత్ర పేరు. యాసిడ్ ఎటాక్ కి గురైన యువ‌తి గా దీపిక మేక‌ప్ అద్బుతంగా కుదిరింది. అందుకోసం ప్రోస్థ‌టిక్స్ ని ఆశ్ర‌యించార‌ని అర్థ‌మ‌వుతోంది. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ త‌న‌పై యాసిడ్ దాడి జ‌రిగిన అనంత‌రం ఆస్ప‌త్రిలో చికిత్స పొంది చివ‌రికి ఎలాగోలా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అనంత‌రం లోక‌ల్ మార్కెట్ లో యాసిడ్ విక్రయిస్తున్న మార్కెట్ వ‌ర్గాల‌పై అలుపెర‌గ‌ని పోరాటం సాగించారు. ఆ దాడికి కార‌ణాల‌పైనా తీవ్ర‌మైన పోరాటం చేసి చివ‌రికి కోర్టులో గెలుపొందారు. ఇలాంటి వాస్త‌విక సంఘ‌ట‌న‌ల్ని క‌థ‌గా రాసుకుని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. దీపిక లాంటి విల‌క్ష‌ణ న‌టి త‌న పాత్ర‌లో న‌టించ‌డంపై ల‌క్ష్మీ అగ‌ర్వాల్ సంతోషం వ్య‌క్తం చేశారు.

User Comments