వివాదాలే దీపిక విజయమా..?

Last Updated on by

ఈ రోజుల్లో ఓ సినిమాపై వివాదం రావ‌డం అనేది చాలా కామ‌న్. నిజానికి వివాదం వ‌స్తేనే విజ‌యం కూడా వ‌స్తుంది. అర్జున్ రెడ్డి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. గ‌తంలో చాలా సినిమాలు వివాదాలు వ‌చ్చిన త‌ర్వాత విజ‌యాలు ఘ‌నంగా వ‌చ్చాయి. ఇప్పుడు ప‌ద్మావ‌త్ కి కూడా ఇదే సూత్రం అప్లై అవుతుందేమో అనిపిస్తుంది ఈ చిత్ర వ‌సూళ్లు చూస్తుంటే. ఒక‌టి రెండు కాదు.. తొలి ఐదు రోజుల్లోనే ఏకంగా 250 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ వ‌సూలు చేసింది ప‌ద్మావ‌త్. ఎన్నో వివాదాలు.. మ‌రెన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ప‌ద్మావ‌త్ తొలిరోజు నుంచే క‌లెక్ష‌న్ల వేట‌లో ముందుంది. ప్రీమియ‌ర్స్ తో క‌లిపి తొలి రోజే 25 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం.. త‌ర్వాత రోజుల్లో మ‌రింత‌గా రెచ్చిపోయింది. రెండోరోజు 32 కోట్లు.. మూడోరోజు మ‌రో 27 కోట్లు.. నాలుగో రోజు 31 కోట్లు వ‌సూలు చేసింది. ఆదివారం వ‌ర‌కు హాలీడేస్ కాబ‌ట్టి క‌లెక్ష‌న్లు కుమ్మేసింది ప‌ద్మావ‌తి.

ఇక అతి కీల‌క‌మైన తొలి సోమ‌వారం నాడు ఏకంగా 15 కోట్లు వ‌సూలు చేసి త‌న‌కు తానే సాటి.. తానే బాక్సాఫీస్ రాణి అని నిరూపించుకుంది ప‌ద్మావ‌తి. ఇప్ప‌టికే ఈ చిత్రం ఇండియాలో 129 కోట్లు వ‌సూలు చేసింది. ఇదే దూకుడు మ‌రో వారం రోజులు కొన‌సాగితే క‌చ్చితంగా 200 కోట్లు కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. బ‌య‌టి దేశాల్లోనూ ప‌ద్మావ‌తి మ‌తి పోగొడుతుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రాణి ప‌ద్మావ‌తి హ‌వా భారీగా ఉంది. ఈ చిత్రం ఇప్ప‌టికే అక్క‌డ 34 కోట్లు వ‌సూలు చేసింది. ఇక మిగిలిన దేశాల్లోనూ మ‌రో 50 కోట్లు వ‌సూలు చేసింది ప‌ద్మావ‌త్. ఈ దూకుడు ఇలాగే సాగేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒక్క సినిమా కూడా రావ‌ట్లేదు. ఫిబ్ర‌వ‌రి 9న అయ్యారీ.. ప్యాడ్ మ్యాన్ వ‌చ్చే వ‌ర‌కు మ‌రో సినిమా లేదు. దాంతో ప‌ద్మావ‌త్ ఈజీగా 350 కోట్లు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ప‌ద్మావ‌త్ స‌రికొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికిన‌ట్లే..!

User Comments