దీపికా పదుకొనె పెళ్లి త్వరలో…

దీపికా పదుకొనె ర‌ణ్ వీర్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారు. దీపికా రియ‌ల్ లైఫ్ హీరోగా ర‌ణ్ వీర్ మార‌బోయే టైమ్ కూడా ద‌గ్గ‌ర ప‌డుతుంది. ఈ ఇద్ద‌రూ మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. స‌హ‌జీవ‌నం కూడా చేస్తు న్నార‌నే వార్త‌లున్నాయి. ఇప్పుడు వీళ్ల ప్రేమ‌కు పెళ్లితో ముడి వేయాల‌ని చూస్తున్నారు పెద్ద‌లు. ఇప్ప‌టికే ఇరు కుటుంబాలు కూడా మాట్లాడేసుకున్నాయి ఈ పెళ్లి గురించి. దీపిక కుటుంబ స‌భ్యులు బెంగ‌ళూర్ నుంచి ముంబై వెళ్లి అక్క‌డే ర‌ణ్ వీర్ కుటుంబంతో పెళ్లి ముచ్చ‌ట్లు పూర్తి చేసుకుని వ‌చ్చారు. వీటికి ముంబైలోని స్టార్ హోట‌ల్సే సాక్ష్యంగా నిలిచాయి.

మ‌రోవైపు ర‌ణ్ వీర్, దీపిక కూడా ఈ మ‌ధ్య ఎక్క‌డికి వెళ్లినా.. వ‌చ్చినా ఇద్ద‌రూ క‌లిసి మెలిసి క‌నిపిస్తున్నారు. ఇనుప‌ముక్క అయ‌స్కాంతాన్ని అతుక్కుపోయిన‌ట్లు.. బెల్లం చుట్టూ ఈగ‌లు మూగిన‌ట్లు.. ప్రియున్ని గ‌ట్టిగా అల్లుకు పోయింది దీపిక ప‌దుకొనే. బాలీవుడ్ లో వీళ్ల ప్రేమాయ‌ణం గురించి తెలియ‌ని వాళ్లు లేరు. రామ్ లీలా టైమ్ లో ప్రేమ‌లో ప‌డిన ఈ జంట‌.. బాజీరావ్ మ‌స్తానీ మీదుగా ప‌ద్మావ‌తి వ‌ర‌కు క‌లిసి జీవించారు. మొత్తానికి ఈ మ‌ధ్య సినిమా వాళ్ల ప్రేమ‌ల‌న్నీ పెళ్లితోనే ముగుస్తున్నాయి. ఇప్పుడు ర‌ణ్ వీర్, దీపిక కూడా ఒక్క‌టైపోతే బాలీవుడ్ లో ప్రేమ‌కు మ‌రింత విలువ పెర‌గ‌డం ఖాయం.