ప‌ద్ద‌తులు ప‌క్క‌న‌బెట్టిన ప‌ద్మావ‌తి..

Last Updated on by

మొన్న‌టి వ‌ర‌కు ప‌ద్మావ‌తి సినిమాతోనే బిజీగా ఉంది దీపిక ప‌దుకొనే. ఆ సినిమా వివాదాలు.. ప్ర‌మోష‌న్.. విజ‌యం.. ఇలా అన్నింటితో గ‌త కొన్ని రోజులుగా బిజీబిజీగా ఉంది దీపిక‌. ఇప్పుడిప్పుడే కాస్త బ‌య‌టికి వ‌చ్చి.. ఫోటోషూట్ల‌పై దృష్టిపెట్టింది దీపిక ప‌దుకొనే. మొన్న‌టికి మొన్న వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై బికిని పోజు ఇచ్చిన దీపిక‌.. ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోయింది.
ఈ సారి ఫెమినాకు అవ‌కాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా క్లీవేజ్ సోకుల‌తో షో చేసి మ‌తులు పోగొట్టింది ఈ ప‌ద్మావ‌తి. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ భామ పిహెచ్ డీకి తాత‌ను పూర్తిచేసింది. గ‌తంలోనే అలా చేసి చూపించింది. ఇప్పుడు మ‌రోసారి కంటిన్యూ చేస్తుంది. కాక‌పోతే మ‌ధ్య‌లో ప‌ద్మావ‌తి కోసం కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో చాలా మంది హీరోల కంటే దీపిక‌కు స్టార్ డ‌మ్ ఎక్కువ‌గా ఉంది. ప‌ద్మావ‌తికి వ‌స్తోన్న క‌లెక్ష‌న్లే దీనికి నిద‌ర్శ‌నం. ఈ చిత్రం 5 రోజుల్లోనే 200 కోట్లు వ‌సూలు చేసింది. బాజీరావ్ మ‌స్తానీ, రామ్ లీలా లాంటి క్లాసిక్స్ ఇచ్చిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ దీపిక‌కు ఇచ్చిన మూడో క్లాసిక్ ప‌ద్మావ‌తి. ఈ చిత్రం కోసం హీరోల కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంది దీపిక ప‌దుకొనే. వాళ్ల‌కి 10 కోట్లు ఇస్తుంటే.. ఈమెకు మాత్రం 13 కోట్లు ఇచ్చారు నిర్మాత‌లు.

ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. ఇదిగో అప్పుడ‌ప్పుడూ ఇలా ఫోటోషూట్ల‌తో కుర్రాళ్ల నిద్ర చెడ‌గొడుతుంది ఈ క‌న్న‌డ క‌స్తూరి. ఈ పొడుగు కాళ్ల సుంద‌రి చేసిన ఫోటోషూట్ కు అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. మొత్తానికి ప‌ద్మావ‌త్ త‌ర్వాత వెంట‌నే ఇలా రెచ్చిపోవ‌డం మాత్రం కాస్త విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తుంది. మ‌రి ఇవ‌న్నీ దీపిక ప‌ట్టించుకుంటుందో లేదో..?

User Comments