అరెరే దీపిక‌.. అదిరింది ప్రియాంక‌..

ఇండియ‌న్ సినిమా రేంజ్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయింది. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు. దాన్ని మ‌రింత ఎత్తుకు తీసుకెళ్తున్నారు మ‌న హీరోయిన్లు. తాజాగా బ్రిట‌న్ లో జ‌రిగిన మెట్ గాలా 2018 వేడుక‌లో ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ నుంచి ప్రియాంక చోప్రాతో పాటు దీపిక ప‌దుకొనే పాల్గొన్నారు. ఆ వేడుక‌లో హాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల‌తో పాటు మ‌న హీరోయిన్లు కూడా అదిరిపోయే ర్యాంప్ వాక్ తో పిచ్చెక్కించారు ముఖ్యంగా వాళ్ళ స్టైల్స్ అక్క‌డున్న హాలీవుడ్ భామ‌ల‌కు కూడా నిద్ర ప‌ట్ట‌కుండా చేసాయి. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా మ‌మ్మీ సినిమాలోని క్లియోపాత్ర గెటప్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. గోల్డ్ క‌ల‌ర్ క్యాస్ట్యూమ్ తో ఈ వేడుక‌లో స‌మ్ థింగ్ స్పెషల్ గా నిలిచింది. ఇక దీపిక కూడా రెడ్ హాట్ గౌన్ లో అదిరింది. పిచ్చెక్కించే లుక్స్ తో అంద‌ర్నీ క‌ట్టిప‌డేసింది. ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ హొయ‌ల‌తో మెట్ గాలా అంతా సంద‌డిగా మారిపోయింది.